అన్వేషించండి

NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !

CJP Protests Delhi: నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రులతో సీజేపీ చర్చలు ముగిశాయి. నిరసనకారులపై కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించగా, విద్యార్థి ఆత్మహత్యలకు పరిహారం , మంత్రి రాజీనామాపై ఏమీ చెప్పలేదు.

Jantar Mantar Student Protest:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న  నీట్ పేపర్ లీకేజీ వివాదం , జంతర్ మంతర్ వద్ద సాగుతున్న విద్యార్థుల ఆందోళనలతో  కేంద్ర ప్రభుత్వం-కాక్రోచ్ జనతా పార్టీ  ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తటస్థ వేదికగా జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొని ఆందోళనకారుల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థులు,  విద్యా రంగానికి చెందిన ప్రతినిధులు ప్రధానంగా తమ మూడు డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు ఉంచగా, అందులోని రెండు ప్రధాన విన్నపాలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

చర్చల అనంతరం సీజేపీ నాయకులు  తాము ప్రతిపాదించిన మూడు ప్రాథమిక డిమాండ్లలో రెండింటికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. నీట్ లీకేజీ అక్రమాలు ,  పరీక్షా గందరగోళం వల్ల మానసిక తీవ్ర వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. దీనితో పాటు జంతర్ మంతర్ ,  ఇతర ప్రాంతాల్లో ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు విద్యార్థులు, యువతపై నమోదు చేసిన పోలీస్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. 

అయితే, విద్యార్థుల ఉద్యమానికి అత్యంత కీలకమైన మూడో డిమాండ్ విషయంలో మాత్రం కేంద్రం మౌనం దాల్చింది. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించడం ,  వరుస పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ స్పష్టం చేసింది.  ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేవరకు లేదా ప్రభుత్వం ఆయనను తొలగించే వరకు ఈ ఆందోళనలు ఆగే ప్రసక్తి లేదు  అని సీజేపీ నేతలు తేల్చిచెప్పారు. కేంద్రం ముందుకు తెచ్చిన ఇతర ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ చర్చల ప్రక్రియ ఇక్కడితో ముగిసిపోలేదని, రేపు  మరోసారి  కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందంతో ద్వితీయ విడత చర్చలు జరపనున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి తీవ్రమైన అంశాల్లో నామమాత్రపు హామీలు కాకుండా, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఒకవైపు ఢిల్లీ వీధుల్లో వేలాది మంది జెన్-జీ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, మరోవైపు ఈ భేటీ ద్వారా కేంద్రం కూడా సయోధ్యకు దిగిరావడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.   

కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై పట్టుపట్టడం ప్రభుత్వానికి సంక్లిష్టంగా మారింది. శనివారం జరగబోయే తదుపరి రౌండ్ చర్చల ఫలితాన్ని బట్టి విద్యార్థుల పోరాటం తీవ్రరూపం దాల్చుతుందా లేదా ఉపశమనం పొందుతుందా అనేది తేలనుంది. సీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ నిరసనల నెట్‌వర్క్‌ను మరింత విస్తరింపజేస్తామని హెచ్చరిస్తోంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
ABP Desam Top 10, 16 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 16 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget