Pune: మితిమీరిన వేగంతో పోర్షీ కార్ నడిపిన మైనర్, బైక్‌కి ఢీకొని ఇద్దరు మృతి
Pune News: పుణేలో ఓ మైనర్ పోర్షీ కార్‌ని మితిమీరిన వేగంతో నడపడం వల్ల బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Porsche Crashes in Pune: పుణేలో పోర్షీ కార్ బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో దూసుకొచ్చి ఓ బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 17 ఏళ్ల కుర్రాడు ఈ కార్‌ని నడుపుతుండగా అది అదుపు తప్పింది. నేరుగా బైక్‌పై దూసుకెళ్లింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో పుణేలోని కల్యాణి నగర్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ క్లబ్‌కి వెళ్లిన ఇద్దరి స్నేహితులు బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. సరిగ్గా కల్యాణి నగర్ జంక్షన్ వద్ద పోర్షీ కార్ వేగంగా వచ్చి వాళ్లని ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారు. వేరే కార్‌పై పడిపోయారు. స్పాట్‌లోనే ఇద్దరూ చనిపోయారు. బైక్‌ని ఢీకొట్టిన తరవాత కార్ పక్కనే ఉన్న పేవ్‌మెంట్‌ని ఢీకొట్టి ఆగిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిన స్థానికులు కార్ నడిపిన 17 ఏళ్ల యువకుడిని బయటకు లాగారు. రోడ్డుపైన ఈడ్చుకుంటూ దారుణంగా కొట్టారు. తరవాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Pune Boy rammed many vehicles with his speeding Porsche, killing two people. pic.twitter.com/XMdpocUKfC
— sarthak (@sarthaktya31022) May 19, 2024