Maoist Mallojula: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ - మల్లోజుల వేణుగోపాల్ గుడ్ బై - పార్టీ క్యాడర్‌కూ సలహా !
Maoist Party: మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ రాజీనామా చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లక్ష్యాన్ని నెరవేర్చలేము.. అందరూ లొంగిపోవాలని క్యాడర్‌కూ సలహా ఇచ్చారు.

Maoist Party Central Committee member Mallojula Venugopal resigns: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సంచలన ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు క్యాడర్ కు లేఖ ద్వారా స్పష్టం చేసిన మల్లోజుల క్యాడర్ అంతా అదే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ క్యాడర్ కు లేఖ రాసిన లేఖలో సాయుధ పోరాట విరమణ పై స్పష్టమైన ప్రకటన చేశారు.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్ @ సోను ఇంతకాలం పార్టీలో బాధ్యత వహించిన పదవిలో ఇక తాను ఉండలేనని వెల్లడించారు. సోను పేరుతో మొత్తం 22 పేజీలతో కూడిన ఈ లేఖలో అనేక అంశాల ప్రస్తావన ఉంది. ఇదే దశలో పార్టీ అప్పగించిన బాధ్యతల్లో కొనసాగే అంశంలో ఆయన స్పష్టతనిచ్చారు. ‘ఆయుధాలు వదిలేస్తాం’ అంటూ కొద్దిరోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభయ్ తన వద్ద గల ఆయుధాలను అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందుని పార్టీ ప్రకటన జారీ చేసింది. క్యాడర్ కు లేఖ రాసిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
సాయుధ పోరాట విరమణ పై స్పష్టమైన చేశారు మల్లోజుల. పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ మల్లోజుల లేఖలో పేర్కొన్నారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ క్షమాపణలు చెప్పారు. పార్టీ క్యాడర్ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని చెప్పారు. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమేనని మల్లోజుల అభిప్రాయ పడ్డారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని ఆయన సూచించారు.
వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మన లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు పిలుపునిచ్చారు. మొత్తం తాజా పరిణామాల్లో అభయ్ అలియాస్ సోను పేరుతో మరో 22 పేజీల లేఖ బయటకు వచ్చింది. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31లోపు తుదముట్టిస్తమని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెద్ద స్థాయి నక్సలైట్లు ఎన్ కౌంటర్ లో చనిపోతుతున్నారు. కొంత మంది లొంగిపోతున్నారు. వందల మంది మావోయిస్టు క్యాడర్ తో పాటు.. తలలపై రూ.కోటి వెల ఉన్న నక్సలైట్లు కూడా లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను కూడా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.




















