Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Visakha News: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అటు, సత్యసాయి జిల్లాలోనూ ఓ బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
Man Abused On Mentally Ill Child In Visakha District: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమెకు మతిస్థిమితం లేదు. ఆ కుటుంబం ఉంటున్న వీధిలోనే వాడమదుల జోగారావు (45) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి వివాహం కాలేదు. జోగారావు ఇంటికి బాధిత బాలిక ఆడుకోవడానికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన అతను 2 రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు వ్యవహరించాడు. బుధవారం ఉదయం బాలిక అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో బాలికను తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ చేస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచారు.
సత్యసాయి జిల్లాలోనూ..
అటు, సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక బహిర్భూమి నిమిత్తం బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి బాలికను రోడ్డు పక్కన బాత్రూంలోకి తీసుకెళ్లి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో కేకలు వేయగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పింది. దీనిపై గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.