అన్వేషించండి

Kurnool District News: బాలికతో యువకుడి అసభ్య ప్రవర్తన- దేహశుద్ది చేసి ఇంటిని తగులపెట్టిన గ్రామస్తులు- కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం

Kurnool District Crime News Today: కర్నూలు జిల్లా దేవనకొండలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని యువకుడిని కొట్టి ఇంటిని గ్రామస్తులు తగలబెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Kurnool Crime News Today:కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలిచెలిమా గ్రామంలో మైనర్‌పై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన బాలిక కేకలు వేసింది. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు ఆ ప్లేస్‌కు చేరుకున్నారు. గ్రామస్తులు చేరుకుంటున్నారని తెలుసుకున్న ఆ యువకుడు బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. 

గురువారం సాయంత్రం యథావిధిగా స్కూలు నుంచి ఇంటికి వచ్చింది బాలిక. పాల కోసం ఇంటి సమీపంలోని పాల కేంద్రానికి వెళ్లి వస్తుండగా యువకుడు వచ్చి ఆమెతో మాట్లాడాడు. కోరిక తీర్చాలని వెంటపడినట్టు స్థానికులు చెబుతున్నారు. లేకుంటే చంపేస్తానంటూ బెదిరించారు. 

యువకుడి మాటలకు భయపడిపోయిన ఆ బాలిక పరుగెత్తుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. యువకుడు ఆమెను వెంటాడుతూ వచ్చాడు. తప్పించుకోలేని గ్రహించిన బాలిక గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడకు గ్రామస్తులు పరుగు పరుగున చేరుకున్నారు. 

గ్రామస్తులు వచ్చేసరికి సమీపంలో ఉన్నవారు రావడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులకు కూడా బాలిక చెప్పింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని వివరించింది.

అత్యాచారం చేయబోయాడనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో వెంకటేశ్వర్లుకు దేహశుద్ధి చేశారు. అంతే కాకుండా అతని ఇంటిపై కూడా దాడి చేశారు. పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.  దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.  

గ్రామస్తులు కొడుతుండగా వారి నుంచి వెంకటేశ్వర్లు తప్పించుకొని పారిపోయాడు. ఆ కోపంతోనే ఆయన ఇంటిని గ్రామస్తులలు తగలబెట్టారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఏం జరిగిందో ఆరా తీశారు. 

మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వెంకటేశ్‌వర్లును కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. 

Also Read: కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు

టాప్ హెడ్ లైన్స్

Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget