By: Ram Manohar | Updated at : 15 Feb 2023 05:36 PM (IST)
అంతర్జాతీయంగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి.
Lufthansa Flight Cancelled:
అంతర్జాతీయంగా లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్ లైన్స్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా చాలా విమానాలు రద్దైనట్టు ఆ కంపెనీ వెల్లడించింది. అయితే...సమస్యకు కారణమేంటన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీనిపై ఇంకా విచారణ చేపడుతున్నట్టు వివరించింది. ప్రస్తుతానికి ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని మాత్రమే చెబుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. జర్మనీలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా..బోర్డింగ్ చాలా ఆలస్యమవుతోందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. లగేజ్‌ను ప్రాసెస్ చేసే విషయంలో డిజిటలైజేషన్ నిలిచిపోయిందని, పేపర్ పెన్ సాయంతో ఒక్కొక్కరి నుంచి సమాచారం తీసుకుని బోర్డింగ్ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఈ విషయమై ట్వీట్ చేసింది.
"ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా లుఫ్తాన్సా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం పడింది. ఈ కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి కొన్ని పూర్తిగా రద్దైపోయాయి. ప్రయాణికులకు కలిగిన ఈ అంతరాయానికి చింతిస్తున్నాం"
-లుఫ్తాన్సా గ్రూప్
ఇప్పటికే కొన్ని టేకాఫ్ అవగా వాటిని వెంటనే ల్యాండ్ చేసేసింది కంపెనీ. మరి కొన్నింటిని ల్యాండ్ అవ్వాల్సి ఉంది.
⚠️Important information on flight disruption: As of this morning the airlines of the Lufthansa Group are affected by an IT outage, caused by construction work in the Frankfurt region. Unfortunately, this has led to flight delays and cancellations. We are working on -
— Lufthansa (@lufthansa) February 15, 2023
- a solution swiftly. Until then we ask all affected guests flying on domestic LH flights in Germany to book a train ticket and request a refund on https://t.co/gErkU3i3QO. More information can be found here: https://t.co/06q1i6vNOQ
— Lufthansa (@lufthansa) February 15, 2023
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్