X

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

ఈ ఏడాదిలో వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూసేందుకు నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లైవ్‌లో సూర్యగ్రహణం చూసేలా చేసింది.

FOLLOW US: 

సంపూర్ణ సూర్యగ్రహం చూసేందుకు నాసా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రత్యేక ఓ యూట్యూబ్ లింక్ క్రియేట్ చేసి అందరూ గ్రహణం చూసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ లింక్‌ను ఏబీపీ దేశం మీకు అందిస్తోంది.  

ప్రపంచవ్యాప్తంగా సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 10.59 నిమిషాలకు మొదలైన మధ్యాహ్నం 12.30 వరకు కనిపించనుంది.  మధ్యాహ్నం 1.33 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అప్పట్నించి గ్రహణం వీడడం మొదలై మధ్యాహ్నం 3.07 నిమిషాలకు పూర్తిగా విడుస్తుంది. అంటే మొత్తం నాలుగ్గంటలకు పైగానే గ్రహణ సమయం వస్తోంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కావడంతో పలు దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. 

మనకి కనిపిస్తుందా?
మనకి నేడు ఏర్పడే సూర్యగ్రహణం కనిపించదు. ఆస్ట్రేలియాలో దక్షిణ భాగంలో నివసిస్తున్న ప్రజలకి, ఆఫ్రికా, ఉత్తరమెరికా, న్యూజిలాండ్ ప్రజలకు పాక్షికంగా కనిపిస్తుంది. అంటార్కిటికా ప్రాంతంలో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. మనకి కనీసం ఒక శాతం కూడా కనిపించదు. కనపించకపోయినంత మాత్రాన మనకి సూర్యగ్రహణం లేదని చెప్పలేం. అందుకే ప్రాచీన కాలంగా ప్రజలు అనుసరిస్తున్న నియమాలు, నమ్మకాలను నేడు కూడా ఆచరిస్తారు. 

గ్రహణ సమయల్లో ఈ పనులు చేయకూడదంటారు...
మన  సంస్కృతులు, సంప్రదాయాల్లో భాగంగా ప్రాచీన కాలం నుంచి గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదనే నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. 

1. గ్రహణం వస్తే మాత్రం గర్భిణిలకు నరకమే. గ్రహణ సమయం వీడే వరకు వారు బొమ్మల్లా కదలకుండా పడుకోవడమో, కూర్చోవడమో చేయాలంటారు. దురదవేసినా గోక్కోకూడదు. ముఖ్యంగా వారు చాకు ముట్టుకోకూడదని, పండ్లను కోయడం వంటి పనులు చేయకూడదని చెబుతారు. ఇలా చేస్తే బిడ్డ వేళ్లు లేకుండా పుడతారని మనదేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు నమ్ముతారు. 
 
2. గ్రహణ సమయంలో ఎవరైనా అనుకోకుండా తమను తాము గాయపరుచుకుని రక్త స్రావం అవుతుంటే, ఆ రక్త స్రావం త్వరగా ఆగదని, గాయం కూడా శాశ్వత మచ్చను వదిలివేస్తుందని నమ్ముతారు. అందుకే పదునైన వస్తువులను గ్రహణ సమయంలో ముట్టుకోవద్దని చెబుతారు. 

3. సాధారణ రోజుల్లో కన్నా గ్రహణసమయంలో దానం చేస్తే అది పదిలక్షల రెట్లు పుణ్యఫలాలను ఇస్తుందని నమ్మకం. 

4. గ్రహణసమయంలో స్నానం చేసి జంతువులకు ఆహారాన్ని పెడితే చాల మంచిదని అనేక మంది పాటిస్తారు. 

5. తినడం, తాగడం, నిద్రపోవడం, సెక్స్ వంటివి పూర్తిగా నిషిద్ధంగా భావిస్తారు. 

6. గ్రహణ సమయంలో ఎవరూ వంట చేయరు. గ్రహణానికి ముందు వండిన ఆహారపదార్థాలను కూడా పారేస్తారు. గ్రహణం విడిచాక వండుకుని తింటారు. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు అప్పటికే వండిన ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయని వారి నమ్మకం. 

ఆయుర్వేం కూడా నమ్ముతోంది...
సైన్సు ఇవన్నీ నిజమని సమర్థించనప్పటికీ, ఆయుర్వేదం మాత్రం నమ్ముతోంది. గ్రహణసమయంలో ఆహారం వండడం, తినడం వంటి పనులకు దూరంగా ఉండాలని చెబుతోంది.

Read also: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Read also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Read also: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Tags: NASA Solar eclipse Total Solar eclipse 2021 Myths and beliefs సంపూర్ణ సూర్యగ్రహణం

సంబంధిత కథనాలు

India Corona Cases: దేశంలో తాజాగా 2,35,532 కరోనా కేసులు.. 50 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు

India Corona Cases: దేశంలో తాజాగా 2,35,532 కరోనా కేసులు.. 50 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే