Leopard Attack: వామ్మో చిరుత పులి- 24 గంటల్లో 13 మందిపై దాడి!
Leopard Attack: అసోంలో చిరుత పులి దాడి చేసిన ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి.

Leopard Attack: అసోంలో చిరుత పులి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జోర్హాట్ జిల్లాలో సోమవారం చిరుత పులి దాడిలో కనీసం 13 మంది గాయపడినట్లు ఏఎన్ఐ తెలిపింది.
అటవీ అధికారుల నుంచి తప్పించుకున్న చిరుత పులి.. జోర్హాట్ ప్రాంతంలో మహిళలు, పిల్లలతో సహా రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RFRI) నివాసితులపై దాడి చేసింది. చిరుత పులికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరుత పులి.. భవనం కంచెపై నుంచి దూకి అటుగా వెళ్తున్న ఓ వాహనంపై దాడి చేసింది.
At least 13 people including 3 forest staff injured in a #Leopard attack in #Assam's #Jorhat district. pic.twitter.com/xyQQ7D1UUC
— Hemanta Kumar Nath (@hemantakrnath) December 26, 2022
Also Read: Maharashtra Karnataka Border: కర్ణాటకతో సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం





















