అన్వేషించండి

Lalit Modi Return to India: 16 ఏళ్ల తర్వాత లలిత్ మోడీ ఘర్ వాపసీ - లీగల్ క్లియరెన్స్ లభించిందా? భారత్‌కు వస్తే అరెస్ట్ చేస్తారా?

Lalit Modi ED FEMA Cases Update: 16 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ భారత్‌కు రాబోతున్నారా? యూకేలో ఎందుకు ఉంటున్నారు? SAFEMA ట్రిబ్యునల్ ఏం తీర్పు చెప్పింది?

Will Lalit Modi Get Arrested in India: ఐపీఎల్  వ్యవస్థాపకుడు, వివాదాస్పద పారిశ్రామికవేత్త లలిత్ మోడీ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారతదేశానికి రానున్నట్లు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. గత 16 ఏళ్లుగా విదేశాల్లోనే నివాసముంటున్న మోడీ, తనపై ఉన్న చట్టపరమైన కేసులు , ఆరోపణల నుంచి ఉపశమనం పొందానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   

 యూకేలో ఎందుకు ఉంటున్నారు? 

2010లో ఐపీఎల్-3 ముగిసిన వెంటనే ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో లలిత్ మోడీని బిసిసిఐ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఆయనపై పలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్  ఉల్లంఘన కేసులు నమోదు చేసింది. అయితే, కేవలం ఈ విచారణల వల్లే కాకుండా, ఐపీఎల్ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు తావివ్వకపోవడంతో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సిండికేట్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయని మోడీ స్పష్టం చేశారు. ప్రాణ భయంతోనే తాను లండన్ పారిపోయానని, గత 16 ఏళ్లుగా లండన్‌లోని బెల్‌గ్రేవ్ స్క్వేర్‌లో నివాసముంటున్నానని తెలిపారు.

 SAFEMA ట్రిబ్యునల్  కీలక తీర్పు 

లలిత్ మోడీ భారత్‌కు రావడానికి సిద్ధపడటానికి ప్రధాన కారణం తాజాగా న్యూఢిల్లీలోని SAFEMA అంటే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్  మానిప్యూలేటర్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పే. 2009లో దక్షణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఈడీ విధించిన భారీ జరిమానాలు, ప్రధాన ఆరోపణలను ట్రిబ్యునల్ కొట్టివేస్తూ మోడీకి పూర్తి ఉపశమనం ఇచ్చింది. ఈ కేసులో తానెప్పుడూ నిరపరాధినేనని, 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు న్యాయం గెలిచి తనపై ఉన్న ప్రధాన లీగల్ అడ్డంకులు తొలగిపోయాయని, అందుకే అధికారికంగా క్లియరెన్స్ వచ్చినట్ల భావిస్తూ స్వదేశానికి రావడానికి సిద్ధమయ్యానని ఆయన ప్రకటించారు.

 భారత్‌కు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 

SAFEMA ట్రిబ్యునల్‌లో క్లియరెన్స్ వచ్చినంత మాత్రాన లలిత్ మోడీపై ఉన్న అన్ని వివాదాలు ముగిసిపోయినట్లు కాదనేది చట్ట నిపుణుల వాదన. గతంలో ఆయనపై  నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు   ఉన్నప్పటికీ, యూకే నుంచి భారత్‌కు రప్పించేందుకు బ్రిటన్ కోర్టులు రెడ్ కార్నర్ నోటీసును ఆమోదించలేదు. ప్రస్తుతం FEMA కేసుల్లో ఉపశమనం దక్కినప్పటికీ, ఇతర దర్యాప్తు సంస్థల వద్ద ఇంకా ఏవైనా మనీ లాండరింగ్ కేసులు యాక్టివ్‌గా ఉంటే.. ఆయన భారత్‌లో కాలు మోపగానే విమానాశ్రయంలోనే ప్రశ్నించే లేదా ముందస్తు అరెస్ట్ చేసే అధికారం ఏజెన్సీలకు ఉంటుంది. అయితే, తనపై ఉన్న ప్రధాన లీగల్ పోరాటాలన్నింటిలోనూ నెగ్గానని నమ్ముతున్న మోడీ, ముందస్తు రక్షణ చర్యలతోనే భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

 పాస్‌పోర్ట్ రద్దు.. రాక ఎప్పుడు? 

భారత్ వదిలి వెళ్లిన తర్వాత లలిత్ మోడీ భారత పాస్‌పోర్ట్‌ను వదులుకుని వనాటు   దేశ పౌరసత్వాన్ని పొందారు. కాబట్టి, ఇప్పుడు ఆయన భారతీయ పౌరుడిగా కాకుండా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ దరఖాస్తు ద్వారా లేదా ప్రత్యేక వీసా ద్వారా మాత్రమే భారత్‌లోకి ప్రవేశించగలరు. తాత కాబోతున్న సంతోషంలో ఉన్న మోడీ, ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఖచ్చితంగా భారత్‌కు వస్తానని వెల్లడించారు. చట్టపరమైన క్లియరెన్స్‌లు లభించినా, భారత దర్యాప్తు సంస్థలు ఆయన రాకపై ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget