News
News
X

Lakhimpur Horror: లఖింపుర్ కేసులో షాకింగ్ విషయాలు- బాలికలపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య!

Lakhimpur Horror: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.

FOLLOW US: 

Lakhimpur Horror: ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్ ఖేరి జిల్లాలో దారణ ఘటన జరిగింది. చెరకు పొలంలో ఇద్దరు దళిత బాలికలు చెట్టుకు ఉరివేసుకుని కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

" వివిధ మార్గాల్లో నేరాలకు పాల్పడిన మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించాం. నిందితుడు జునైద్‌ను ఎన్‌కౌంటర్‌లో పట్టుకున్నారు. దీంతో అతని కాలికి గాయమైంది.                                "
-సంజీవ్ సుమన్, లఖింపుర్ ఖేరి ఎస్‌పీ

నిందితులు.. మృతి చెందిన బాలికలకు స్నేహితులని ఎస్‌పీ వెల్లడించారు.

" నిన్న బాలికలను పొలాలకు రప్పించి సోహైల్, జునైద్‌లు అత్యాచారం చేశారు. బాలికలు నిందితులను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతునులిమి చంపారు. ఆ తర్వాత వారు కరీముద్దీన్, ఆరిఫ్‌లను పిలిచి బాలికలను చెట్టుకు ఉరితీశారు. "
-                                       సంజీవ్ సుమన్, లఖింపుర్ ఖేరి ఎస్‌పీ

పోస్ట్‌మార్టం

చోటూ మినహా నిందితులందరూ లఖింపుర్ ఖేరిలోని లాల్‌పుర్ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. చోటూ ఇల్లు బాలికల ఇంటి దగ్గరే. అతనే బాలికలను.. ఈ నిందితులకు పరిచయం చేశాడని ఎస్‌పీ తెలిపారు.

" ఇది ప్రాథమిక విచారణ. 2-3 గంటల్లో పోస్ట్‌మార్టం ప్రారంభం కానుంది. ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది. కేసు మహిళలపై అందులోనూ సమాజంలోని బలహీన వర్గాలకు చెందినది కనుక మేం చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నాం.                                 "
-  సంజీవ్ సుమన్, లఖింపుర్ ఖేరి ఎస్‌పీ

ఇదీ జరిగింది

లఖింపుర్ ఖేరి జిల్లాలోని నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చెరుకు తోటలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు.

అయితే ఆ ఇద్దరు బాలికల తల్లి వారిని హత్య చేశారని ఆరోపించారు. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి హత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్, ‘ఇది న్యాయాన్ని అవహేళన చేయ్యడమే’

Also Read: Chintu Cheetah: ఇండియాకు వస్తున్న ఆఫ్రికన్ చీతా, ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషలా?

Published at : 15 Sep 2022 10:52 AM (IST) Tags: up Lakhimpur Kheri Lakhimpur Horror 2 Minor Girls Found Hanging

సంబంధిత కథనాలు

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా