Next Dalai Lama: తదుపరి దలైలామా ఎవరో తేల్చే హక్కు చైనాకు లేదు - బౌద్ధ సంఘాలు
Next Dalai Lama: తదుపరి దలైలామాను ఎంపిక చేసుకునే విషయంలో చైనా జోక్యాన్ని సహించమని బౌద్ధ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
Who is Next Dalai Lama:
తదుపరి ఎవరు..?
చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో...వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి. భారత్‌లోని బౌద్ధ సంస్థలన్నీ ఇదే మాటను ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరనసలూ చేపడుతున్నాయి. తన తరవాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి. అయితే అటు చైనా మాత్రం తరవాతి దలైలామాను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెబుతోంది. నిజానికి...టిబెట్ చైనాలో
భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తోంది. అందుకే...దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది. ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే...టిబెట్‌ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. మరోవైపు లద్దాఖ్ నుంచి ధర్మశాల వరకూ బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పు బడుతున్నాయి.
ఇప్పటికే ఈ సంస్థలన్నీ చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దలైలామాను ఎంచుకునే హక్కు టిబెట్‌కే ఉంటుంది. ఈ మేరకు అమెరికా, టిబెట్ మధ్య ఓ ఒప్పందమూ కుదిరింది. చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత దలైలామా తదుపరి దలైలామా ఎవరో గతంలోనే చెప్పారు. తన వారసుడు భారత్, చైనా దేశాలకు చెందిన వాడు కాదని వేరే దేశంలో పుట్టిన వాడే అవుతాడని జోస్యం చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బౌద్ధులు తదుపరి ఎవరా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా చైనా హడావుడి చేయడం వల్ల ఆ దేశానికి హక్కు లేదని మండి పడుతున్నాయి బౌద్ధ సంఘాలు.
చైనాకు తిరిగి వెళ్లను: దలైలామా
ఆధ్యాత్మికవేత్త దలైలామా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని, ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని అన్నారు. భారత్ తనకు శాశ్వత నివాసం అని వెల్లడించారు. "చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నాకు భారత్‌లో ఉండటమే ఇష్టం. ఇండియా నాకెంతో నచ్చింది. కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు. ఇదే నాకు శాశ్వత నివాసం" అని స్పష్టం చేశారు. ఇక ఇటీవల తవాంగ్‌లో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావించగా దానికీ సమాధానమిచ్చారు దలైలామా. "మునుపటి కన్నా పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చైనా వైఖరి కాస్త మారింది. అయినా...చైనాకు వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు" అని వివరించారు. 1959లో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబెటియన్లు తమ ప్రాంతాన్నీ వీడాల్సి వచ్చింది. వారంతా భారత్‌కు వలస వచ్చారు. దలైలామా కూడా వారిలో ఉన్నారు. ముస్సోరి, ఉత్తరాఖండ్‌లో కొంతకాలం పాటు ఉన్నారు. 1960లో ధర్మశాలకు వెళ్లిపోయారు.
Also Read: Jan Aakrosh Yatra: "జన్ ఆక్రోశ్ యాత్ర" రద్దు కాలేదు- కరోనా నిబంధనలతోనే కొనసాగిస్తామన్న బీజేపీ