KRMB Projects : తెలంగాణ ప్రాజెక్టులిస్తేనే తామిస్తామన్న ఏపీ ! కేఆర్ఎంబీ గెజిట్ అమలుపై మళ్లీ మొదటికొచ్చిన వివాదం !

కేఆర్ఎంబీ గెజిట్ అమలు చేయడానికి ప్రాజెక్టుల్ని అప్పగించడానికి రెండు ప్రభుత్వాలు సిద్దంగా లేవు. తెలంగాణ ఇస్తే తామిస్తామటూ ఏపీ జీవో జారీ చేసింది. తెలంగాణ కమిటీ వేసింది.

FOLLOW US: 

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అమలుకు అంగీకరిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఓ జీవో జారీ చేసింది.  శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఆరు కాంపోనెంట్‌లను అప్పగించేందుకు జీవోలో అంగీకారం తెలిపింది. అయితే ఇక్కడ ఓ షరతు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం 9 కాంపోనెంట్‌లను అప్పగించిన వెంటనే తాము ఆరు కాంపోనెంట్‌లను ఇస్తామని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఆఫీస్‌లు, సిబ్బంది, ప్లాంట్‌, ఎక్విప్‌మెంట్‌ అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. జూరాలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని.. లేదంటే తమకు ఇబ్బందులు వస్తాయని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి స్పష్టం చేసింది. 

Also Read : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. సీఎం సహా ఉన్నతాధికారులతో మరోసారి చర్చించిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై ముందడుగు వేసే అవకాశం ఉంది. అందుకే  కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్ోతంది ఈఎస్సీ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలంగాణ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ ప్రాజెక్టులు చేర్చడంపైనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడుతోంది. 

Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !

ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రోజుల కిందటే కటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది.  శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది. 

Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించడం.. తెలంగాణ ఇస్తే తామిస్తామంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో  .. ఇప్పుడు కృష్ణా బోర్డు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  దసరా రోజు నుంచి గెజిట్ అమలు ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ జల వివాదాలు కేఆర్ఎంబీ గెజిట్ విడుదలైన తర్వాత కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 08:05 PM (IST) Tags: Telangana CM KCR AP Cm Jagan Krishna Water Dispute Krishna River Management Board AP - Telangana Water Dispute Krishna Board Projects

సంబంధిత కథనాలు

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !