X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

AP DGP : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !

ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారని.. వాటిని మీడియా ప్రచురిచిందని .. క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. ఏపీ డీజీపీ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజకీయ ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు, వాటిని ప్రచురించారటూ పత్రికలకూ నోటీసులు పంపడం వివాదాస్పదం అవుతోంది. దేశ చరిత్రలో ఓ డీజీపీ ఇలా రాజకీయ ఆరోపణలు చేశారని.. వాటిని పత్రికల్లో ప్రచురించారని పరువు నష్టం నోటీసులు జారీ చేయడం ఇదే మొదటి సారి. దీంతో డీజీపీ గౌతం సవాంగ్ తీసుకున్న నిర్ణయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 


డ్రగ్స్ కేసులో టీడీపీ ఆరోపణలు !


ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంది విజయవాడలో రిజిస్టరైన ఆషి ట్రేడింగ్ కంపెనీ. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఇంకా విచారణ ప్రారంభం కాక ముందే విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత డీజీపీ కూడా అదే ప్రకటన చేశారు. కానీ తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం అసలు విచారణ చేయకుండా ఎలా ప్రకటిస్తారని విమర్శలు ప్రారంభించారు. ఎపీలో డ్రగ్స్ డాన్ ఎవరో చెప్పాలని ఆరోపణలు చేస్తున్నారు. 


Also Read : టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి !


ఆరోపణలు చేసిన వారికి.. వాటిని ప్రచురించిన మీడియాకు డీజీపీ నోటీసులు !


టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పత్రికల్లో కూడా వస్తున్నాయి. దీంతో డీజీపీ తాము వివరణ ఇచ్చినప్పటికీ ఆరోపణలు చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు పంపించారు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు  చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌తో పాటు వాటిని ప్రచురించిన రెండు దినపత్రిలకు కూడా నోటీసులు పంపించారు. ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని డీజీపీ గౌతం సవాంగ్ నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ నేతలు, మీడియా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 


Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !


నోటీసులు చిత్తు కాగితాలతో సమానం అన్న టీడీపీ !


అయితే డీజీపీ పేరుతో వచ్చిన నోటీసుల్ని తెలుగుదేశం పార్టీ తేలికగా తీసుకుంది. డ్రగ్స్‌ దందాపై ప్రశ్నిస్తున్నందుకే  డీజీపీ నోటీసులు పంపారని.. ఆ నోటీసులపై అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తామని ప్రకటించారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీ్‌సను జగన్‌ పర్సనల్‌ సర్వీస్‌గా డీజీపీ సవాంగ్ మార్చాలని టీడీపీ విమర్శించింది. కోర్టు బోనులో నిలబడి ఐపీసీ సెక్షన్లను డీజీపీ అప్పచెప్పినప్పుడే పోలీస్‌ శాఖ పరువు పోయిందన్నారు. డీజీపీ తమకు ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితంతో సమానమని తేల్చేశారు.


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


డీజీపీ కూడా రాజకీయంగా ప్రతిపక్షాలుగా భావిస్తారా ?


రాజకీయ పార్టీలు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటాయి. అది అది రాజకీయంగానే తీసుకుంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా ఆరోపణలు చేశారు. అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ.. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాయి. అవన్నీ రాజకీయంగానే ఉన్నాయి కానీ ఇలా పోలీసులు, దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలను కోరిన సందర్భాలు లేవు. అందుకే ఏపీ డీజీపీ .. ప్రతిపక్షాలకు ఇచ్చిన నోటీసులు హైలెట్ అవుతున్నాయి. ఏపీ డీజీపీ అధికార పక్షానికి చెందిన వారు కాదు. కానీ ఆయన ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా ప్రతిపక్షాలు అని సంబోధిస్తూ ఉంటారు. అది కూడా వివాదాస్పదమవుతోంది.


Also Read : ఏపీ సర్కార్ కు మరోసారి చుక్కెదురు... ఇళ్ల పథకంపై సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్... స్వీకరణకు నో చెప్పిన డివిజన్ బెంచ్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Gautam Sawang with AP DGP Notices to Political Criticisms Opposition Media Political DGP AP DGP Decision Topic Political Agenda

సంబంధిత కథనాలు

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? మీకోసం ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.. చూడండి

Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? మీకోసం ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.. చూడండి

Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. జీతాల్లో కోత

Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. జీతాల్లో కోత
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?