AP Employees : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !
నెలాఖరుకు పీఆర్సీ ప్రకటిస్తామని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన సమస్యలను వచ్చే నెలాఖరుకల్లా పరిష్కరిస్తామన్నారు.
పే రివిజన్ కమిషన్ సమస్యను నెలాఖరుకు పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంవో అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. చర్చల్లో నెలాఖరులోగా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల హామీ ఇచ్చారు. పీఆర్సీ సమస్యను పరిష్కరించడం అంటే.. పీఆర్సీని ప్రకటిస్తారా లేదా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తారా అన్నదానిపై స్పష్టత లేదు.
Also Read : ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం !
ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని ఇక నుంచి ఫస్ట్ ప్రయారిటీగా జీతాలు తీసుకుంటామని సజ్జల వారికి హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారంలోనే ఐఆర్ ఇచ్చారనిగుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర పెరిగిందని.. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని తెలిపారు.ఉద్యోగుల సంక్షేమంలో జగన్ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉందిని.. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందన్నారు. వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయన్నారు.
Also Read : ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?
సమయానికి జీతాలు, పెన్షన్లు రాకపోవడం ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ గురించి స్పందించకపోవడం, చివరికి డీఏలు కూడా పెండింగ్ లో పెట్టడం వంటి కారణఆల వల్ల ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి.. మాట్లాడటం వివాదాస్పదం అయింది. బెదిరించారని మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో తర్వాత అలాంటిదేమీలేదని వివరణ ఇస్తూ మరో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ వివాదాల నేపధ్యంలో సీఎంవో ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచింది.
అయితే రెండు సంఘాల జేఏసీ నేతలను మాత్రమే చర్చలకు పిలువడంతో ఇతర ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. అవన్నీ టైంపాస్ మీటింగ్‌లేనని ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. చర్చలకు ప్రభుత్వం పిలువలేదని.. వీళ్లే వెళ్లారని ఆస్కార్ రావు అనే ఉద్యోగ సంఘం నేత మండిపడ్డారు. నెలాఖరులోపు పీఆర్సీని ప్రకటించకపోతే ఆందోళనలు చేయాలన్న ఉద్దేశంలో ఉద్యోగులు ఉన్నారు.
Also Read : రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! ‘మంచు’కు ముందుంది అసలు పరీక్ష !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి