అన్వేషించండి

Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

Common Man Legal Rights: తప్పుడు ఆరోపణలతో జీవిత కాలం సంపాదించుకున్న ప్రతిష్ట దెబ్బతీసారు, మనేవేదనకు గురిచేసారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రే కన్నీరు పెడితే ...ఇక సమాన్యూడి పరిస్తితేంటి? వారి హక్కులేంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
Common Man Legal Rights: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలో నిర్ధషిగా తేలిన తర్వాత కోజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. మూడెళ్లపాటు తీవ్ర మానసిక క్షోభను అనుభవించాను, జీవితకాలం సంపాదించుకున్న ప్రతిష్టకు మచ్చ తెచ్చారు, రాజకీయంగా వేధించారంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. అక్కడున్నది బాగా చదువుకున్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన, పార్టీ అధ్యక్షుడు. అక్రమ ఆరోపణలవల్ల అతని పరిస్థితే అలా వుంటే ఇంక ఇలాంటి ఆరోపణలు సమాన్యూడిపై వస్తే పరిస్తితేంటి అనే ప్రశ్న అందరిలోనూ కలగక మానదు. 
 
న్యాయస్థానం ఒక తీర్పు చెప్పిన తర్వాత కేసు ముగిసిపోయిందనుకోవచ్చు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది — తప్పుడు ఆరోపణలతో సంవత్సరాల పాటు మానసిక, రాజకీయ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారి జీవితాల్లో ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? పరిహారం ఎవరిస్తారు ? 
 
 రాజకీయ నాయకుడు లేదా సామాన్య పౌరుడు — ఎవరైనా కావచ్చు. తప్పుడు కేసులు, ఉద్దేశపూర్వక ఆరోపణలు, మీడియా ట్రయల్స్… ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి జీవితాన్ని గందరగోళం చేస్తాయి. దీనివల్ల నాయకులకు రాజకీయ నష్టం కలుగుతుంది. వారిపట్ల ప్రజాభిప్రాయం దెబ్బతింటుంది, న్యాయపోరాటానికి భారీ ఖర్చులవుతాయి, మానసిక వేదన, కుటుంబంపై ఒత్తిడి, అవమానం. సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరుగుడు.
 
దీనిపై చట్టం ఏం చెబుతోంది?
 
 నిర్దోషిగా విడుదలైన తర్వాత పరిహారం అడగవచ్చా? తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్య? ప్రభుత్వంపై బాధ్యత ఉందా? అంటే అవుననే చెప్దుంది చట్టం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం పరిరక్షించాలి. అక్రమ అరెస్టులు, దురుద్దేశపూర్వక కేసులు ఉంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. జరిగిన నష్టానికి పరిహారం కూడా కోరవచ్చు. కొన్ని కేసుల్లో కోర్టులు ప్రభుత్వాన్ని పరిహారం చెల్లించమని ఆదేశించిన ఉదాహరణలు ఉన్నాయి.
 
క్రిమినల్ చర్యలు: భారతీయ న్యాయ సంహిత (గతంలో IPC) ప్రకారం, హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై తిరిగి కేసు పెట్టవచ్చు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం చెబితే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
 
పరువు నష్టం దావా: అక్రమ కేసు వల్ల సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతింటే, సివిల్ కోర్టులో 'డిఫమేషన్' కేసు వేయవచ్చు. మీ హోదాను బట్టి ఎదుటి వ్యక్తి నుండి భారీ నష్టపరిహారం వసూలు చేసే హక్కు మీకు ఉంటుంది.
 
మెలిషియస్ ప్రాసిక్యూషన్ (దురుద్దేశపూరిత విచారణ)కు పరిహారం పొందొచ్చు.. ఎటువంటి సరైన కారణం లేకుండా, కేవలం వేధించాలనే లక్ష్యంతో మీపై కేసు నడిపించినట్లు తేలితే, మీరు సివిల్ దావా వేయవచ్చు.
 
ఎలాచేయాలి... 
తప్పు అరెస్టులు, అధికారం దుర్వినియోగం జరిగితే బాధితుడు Writ of Compensation కోరవచ్చు. లేదా జాతీయ మానవహక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేయవచ్చు. సివిల్ కోర్టులో నష్టపరిహారం కోసం కేసు వేయవచ్చు. సుదీర్ఘకాలం ఆరోపణలు, విచారణ, న్యాయపరమైన జాప్యం వల్ల జరిగిన నష్టాన్ని అందులో వివరిస్తూ అందుకు తగిన ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. 
 
కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది?
 
చట్టపరంగా మార్గాలు ఉన్నప్పటికీ పరిహారం పొందడం సులభం కాదు. అందుకు మరోసారి న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది. మళ్లీ సమయం, ఖర్చు మళ్లీ భారంగా మారుతాయి. అందుకే చాలా మంది దొరింకిందే న్యాయం ఇంక చాలు అనుకుని కోర్టులకు దండం పెడుతుంటారు అలా చేయడం వల్ల తప్పుడు ఆరోపణలు చేసే వారికీ, అధికారం చెలాయించే అధికారులకు ఇంలాంటి తప్పుడు కేసులు మోపే అవకాశం మనమే ఇచ్చిన వాళ్లమవుతున్నాము.అందుకే చట్టంపట్ల అవగాహణతో వుంటే న్యాయం పొందడానికి మాత్రమే కాదు నేరం జరగకుండా కూడా నియంత్రించే అవకాశముంటుంది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake Ginger-Garlic Paste : బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Embed widget