అన్వేషించండి

ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

ABP Southern Rising Summit: విమాన ప్రయాణాన్ని మధ్యతరగతికి చేరువ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ABP Southern Rising Summit 2024 Rammohan Naidu : ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఎయిర్ కనెక్టివిటీ ఇండియాలో ఉండే విధంగా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇన్ ప్రా డెవలప్‌చేస్తోందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉడాన్ స్కీమ్ ద్వారా విమానాశ్రయాల మధ్య కనెక్టివిటీ కూడా పెంచుతామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రామ్మోహన్ నాయుడు కీల అంశాలపై మాట్లాడారు . 

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి

ఉడాన్ పథకాన్ని ప్రవేశ పెట్టి  పదేళ్లు అవుతున్నా మధ్యతరగతికి ఇంకా విమాన ప్రయాణం లగ్జరీగా మారిందన్న అంశంలో రామ్మోహన్ నాయుడు భిన్నంగా స్పందించారు. ఎప్పటిక్పుపుడు విమానాయానరంగాన్ని మధ్యతరగతి ప్రజలకు కూడా అనుకూలంగా ఉండేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విమానాశ్రయాలకు వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ ఆకతాయిలు పాల్పడుతున్నారనే ఎక్కువ మంది నమ్ముతున్నారని అయితే కుట్ర ఉందని చెప్పలేమన్నారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయన్నారు. ప్రయాణికుల భద్రతకు వంద శాతం ప్రాధాన్యతమిస్తామన్నారు.  మోదీ మంత్రి వర్గంలో అత్యంత చిన్న వయసు కేంద్రమంత్రిగా ఉండటం ప్లస్ పాయింటేనన్నారు. సివిల్ ఏవియేషన్‌కు ప్రధానమంత్రి మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ మంత్రులకు స్వేచ్చ ఇస్తారన్నారు. స్వేచ్చగా పని చేసి ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తారన్నారు. 

రాజకీయ ప్రతీకారం తీర్చుకునే అంశంపై ప్రస్తుతం ఏపీలోని ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమిపై ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో అధికారం ఇచ్చారని అన్నారు. జగన్ హయాంలో నిర్వీర్యానికి గురైన వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి ప్రస్తుతం ప్రభుత్వం  ప్రయత్నిస్తోందన్నారు. అన్ని హామీలను అమలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. కక్ష సాధింపులు అనేవి ఉండవు కానీ.. అవినీతి అక్రమాలపై చట్ట  పరంగా దర్యాప్తు జరుగుతోందని చర్యలను తీసుకంటారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 

సాయి దుర్గా తేజ్: 6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని తమిళనాడు సీఎం, ఏపీ సీఎం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపుస్తున్న అంశంలో ఎలాంటి వివాదం లేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జనాభా పెరుగుదల తగ్గిపోయిన దేశాలను చూసినప్పుడు మనం తొందరపడాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఇరవై, ముఫ్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్లే పరిస్థితి కొనసగితే ఎన్నో సమస్యలు వస్తాయన్న సంగతిని మనం ఊహించవచ్చని అన్నారు.  నేను యాక్సిడెంటర్ రాజకీయ నాయుకుడ్ని కాదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తన తండ్రి మృతి కారణంగా రాజకీయాల్లోకి వచ్చి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా పూర్తిగా నిరూపించుకున్నానని తెలిపారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తి ఇంటర్యూ లింక్‌ను  ఇక్కడ చూడవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంకీర్ణ ప్రభుత్వం దేశానికి మంచిదేనా? ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్, మధుయాష్కిరెజ్లర్లు ఏం తినరు, వెయిట్ లాస్ అనేది ఓ టార్చర్ - పుల్లెల గోపీచంద్చీరల విషయంలో మహిళలు కాంప్రమైజ్ అవ్వరు - గౌరంగ్ షాఅమ్మ పేరు ఎందుకు పెట్టుకున్నానో తొలిసారి చెప్పిన సాయిధరమ్ తేజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Pullela Gopichand Speech: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
Bindu Subramaniam Speech: రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
Sai Durgha Tej At Southern Rising Summit: సాయి దుర్గా తేజ్:  6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
సాయి దుర్గా తేజ్: 6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
Aravind Sanka Speech: 20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
Embed widget