Karnataka Sanskrit University: 100 ఎకరాల్లో రూ.300 కోట్లతో సంస్కృత విశ్వవిద్యాలయం.. మంగళవారం సీఎం శంకుస్థాపన
రూ.320 కోట్లతో దాదాపు 100 ఎకరాల్లో నిర్మితమవుతోన్న కర్ణాటక సంస్కృత యూనివర్సిటీకి సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
సంస్కృతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రామనగర జిల్లాలోని మగది పట్టణంలో కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడ సంస్కృత విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నడుస్తున్నాయి. అయితే ఇన్నేళ్లకు శాశ్వత క్యాంపెస్‌కు మోక్షం కలిగింది.
Karnataka Sanskrit University will get a permanent campus in Magadi, Ramanagara after 10 years of functioning. CM Bommai will lay the foundation stone for the University tomorrow. University will come up on 100 acres of land at a cost of Rs 320 crs. pic.twitter.com/wCpxBHc9OX
— . (@ram_bhaktha) January 2, 2022
ఈ యూనివర్సిటీకి సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.320 కోట్లతో దాదాపు 100 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ నిర్మితమవుతోంది.
2010లోనే ఈ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతి వచ్చినప్పటికీ భూసేకరణ సమస్యల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ కింద 2 సంస్కృత కళాశాలలు, 10 ఎయిడెడ్ కళాశాలలు, 9 అన్ ఎయిడెడ్ అఫ్లియేటెడ్ కళాశాలలు ఉన్నాయి.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బొమ్మై తొలిసారి రామనగర జిల్లాకు వెళుతున్నారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన రేపు శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగానే ఈ సంస్కృత విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఆధునిక విద్యతో పాటు సంస్కృతాన్ని కూడా విద్యార్థులు అభ్యసించనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులు లాభపడనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Children's Covid Vaccination: తొలి రోజే 12.3 లక్షల మంది పిల్లలకు కరోనా వ్యాక్సిన్
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు