WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
కొవిడ్ 19కి ఈ ఏడాదిలోనే ముగింపు పలికే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభంతో మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచానికి 2022లో ఈ వైరస్ ముంగిపు చూసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ డెైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు.
ఈ ఏడాదిలో ప్రపంచం ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కేవలం కొవిడ్ కాదని ఇంకా చాలానే ఉన్నాయని టెడ్రోస్ అన్నారు. కొవిడ్ సంక్షోభంలో పడిపోయిన ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, మిగిలి సాంక్రమిక రోగాలకు చికిత్స తీసుకోవడంలో అలసత్వం చూపారని టెడ్రోస్ అన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి..
భారత్‌లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 33,750 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 1700 మార్కు దాటింది.
మహారాష్ట్రలో కొత్తగా 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 11,877 కరోనా కేసులు వెలుగుచూశాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,41,542కు చేరింది.
రాష్ట్రంలో 42,024 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 11,877 కరోనా కేసుల్లో ఒక్క ముంబయిలోనే 7792 రావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ముంబయిలోనే 8,063 కేసులు నమోదయ్యాయి
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు