Karnataka CM Race: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్
Karnataka CM Race: డిప్యుటీ సీఎంగా హైకమాండ్ ప్రకటించిన తరవాత డీకే శివకుమార్ తొలిసారి స్పందించారు.
![Karnataka CM Race: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్ Karnataka's Future, People's Welfare Top Priority, DK Shivakumar's Reaction on Bieng Declared Deputy CM Karnataka CM Race: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/6addc45816659e4a2c65b3ed73bde08c1684396577602517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka CM Race:
ట్విటర్లో ఫోటో..
కర్ణాటక సీఎం రేసుకి తెరపడింది. సీఎంగా సిద్దరామయ్యను ప్రకటించింది హైకమాండ్. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. డీకే శివకుమార్‌కి డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టారు. సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడ్డ ఆయనను డిప్యుటీకి పరిమితం చేసిం అధిష్ఠానం. అయితే...ఈ నిర్ణయంపై తొలిసారి డీకే స్పందించారు. తాము అంతా కలిసే ఉన్నామని, కర్ణాటక ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. సిద్దరామయ్య, ఖర్గేతో కలిసి దిగిన ఫోటోని ట్విటర్లో పంచుకున్నారు.
"కర్ణాటక ప్రజల భవిష్యత్‌కి భరోసా ఇవ్వడం, వాళ్ల సంక్షేమానికి కట్టుబడి ఉండటం..ప్రస్తుతానికి ఇవే మా ప్రాధాన్యత. ఈ విషయంలో మేము కలిసికట్టుగా పని చేస్తామని హామీ ఇస్తున్నాను"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
Karnataka's secure future and our peoples welfare is our top priority, and we are united in guaranteeing that. pic.twitter.com/sNROprdn5H
— DK Shivakumar (@DKShivakumar) May 18, 2023
135 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది నేనే అని అంత కాన్ఫిడెంట్‌గా స్టేట్మెంట్ ఇచ్చిన శివకుమార్‌ను పక్కన పెడితే...కాంగ్రెస్‌కు నష్టం తప్పదేమో అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఇప్పటికే ఇంటి పోరుతో నలిగిపోతున్న ఆ పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా...శివకుమార్‌కి సీఎం పదవి కట్టబెట్టకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక పాలిటిక్స్‌లో ధనవంతుల లిస్ట్ తీస్తే..అందులో ముందుగా కనిపించే పేరు డీకే శివకుమార్. ఆస్తులే కాదు...అదే స్థాయిలో అవినీతి కేసులూ ఆయన పేరిట ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టై దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. సీబీఐ విచారణను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ని కూడా హైకోర్టు కొట్టేసింది. పదేపదే ఈడీ విచారణకు హాజరవుతున్నారు డీకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని...అధిష్ఠానం శివకుమార్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులను పట్టించుకోకుండా సీఎం పదవి ఇచ్చినా...దర్యాప్తు సంస్థలు ఆయనను పదేపదే విచారణకు పిలవడం కాస్త ఇబ్బంది కలిగించడం ఖాయం. ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే..ఇక ప్రభుత్వంపై ప్రజలకు ఏం నమ్మకముంటుంది..? ఇదిగో ఇదే పాయింట్‌తో హైకమాండ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు.
సీఎం పదవికి పోటీ పడాలంటే ఎమ్మెల్యేల బలం గట్టిగా ఉండాలి. ఈ విషయంలో సిద్దరామయ్య కన్నా వెనకబడి ఉన్నారు డీకే. ఆయనకు కేవలం 40 మంది మాత్రమే సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే...వాళ్లకే సీఎం పదవి ఇస్తామని ఇప్పటికే రాహుల్ చాలా క్లారిటీగా చెప్పారు. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో సిద్దరామయ్య సిద్ధహస్తుడు. 2013లో ఈ వ్యూహంతోనే ఖర్గేను ఓడించారు. ఈ సారి కూడా అదే స్ట్రాటెజీ అమలు చేసి 90 మంది బలాన్ని కూడగట్టుకున్నారు. అందుకే...అధిష్ఠానం అన్ని విధాలుగా ఆలోచించి...సిద్దరామయ్యకు పదవి అప్పగించింది.
Also Read: Karnataka Election 2023: కర్ణాటక సీఎం పదవిపై ఉత్కంఠకు తెర, సిద్దరామయ్యకే ఓటు వేసిన హైకమాండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)