By: Ram Manohar | Updated at : 18 May 2023 12:51 PM (IST)
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను అధిష్ఠానం ఎంపిక చేసింది.
Karnataka Election 2023:
సుదీర్ఘ చర్చల తరవాత ప్రకటన..
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న (Karnataka CM Race) ఉత్కంఠకు తెరపడింది. బెంగళూరులో సుదీర్ఘ చర్చల తరవాత హైకమాండ్ సిద్దరామయ్యనే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. డీకే శివకుమార్ కూడా రేసులో ఉన్నప్పటికీ...సీనియర్ నేత అన్న గౌరవంతో ఆయనకే ఆ పదవి కట్టబెట్టింది. ఆయనకు డిప్యుటీ సీఎం పదవి అప్పగించింది. అన్ని విధాలుగా ఆలోచించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ విషయం వెల్లడించారు. డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కృషిని అభినందించింది. శివకుమార్, సిద్దరామయ్యలో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చాలా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపిన తరవాత సిద్దరామయ్యను ఎంపిక చేశారు. శివకుమార్‌ని పీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా నియమించింది. 2024లో లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఆయనే ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని వేణుగోపాల్ స్పష్టం చేశారు. మే 20న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే ప్రతి పార్టీనీ ఆహ్వానిస్తామని తెలిపారు.
#WATCH | Siddaramaiah will be the Chief Minister of Karnataka and DK Shivakumar will be the only deputy CM, announces KC Venugopal, Congress General Secretary -Organisation. pic.twitter.com/q7PinKYWpG
— ANI (@ANI) May 18, 2023
Shivakumar will continue as the PCC president till the end of parliamentary elections. CM, Dy CM and a group of ministers will be sworn-in on 20th May: KC Venugopal, Congress General Secretary -Organisation
— ANI (@ANI) May 18, 2023
దాదాపు నాలుగు రోజులుగా ఈ సస్పెన్స్ కొనసాగింది. డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరూ రేసులో ఉండటం, ఇద్దరూ కీలక నేతలే కావడం వల్ల హైకమాండ్‌కి ఇంత టైమ్ పట్టింది. వరుస భేటీలతో వాళ్లకు పరిస్థితులను వివరించింది. కర్ణాటక భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరింది. ఆ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోనూ చర్చలు జరిగాయి. చివరి వరకూ సీఎం కుర్చీ కావాలని పట్టుపట్టిన డీకే శివకుమార్...చివరకు త్యాగం చేశారు. హైకమాండ్ మాటకే తలొగ్గారు. కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తానన్నా ముందు మొండికేసిన ఆయన...సోనియాతో మాట్లాడిన తరవాత వెనక్కి తగ్గారు. చివరి నిముషం వరకూ ఉత్కంఠగా సాగిన చర్చలు...సోనియా ఎంట్రీతో కాస్త సద్దుమణిగాయి. రాహుల్, ఖర్గే ముందుండి నడిపించినా..సోనియా గాంధీ వెనకాల ఉండి దారి చూపించారు. లేకపోతే...ఈ సస్పెన్స్ ఇంకొన్నాళ్ల పాటు కొనసాగేది. త్వరలోనే కేబినెట్నీ డిక్లేర్ చేయనుంది హైకమాండ్.
Also Read: Karnataka CM Race: సోనియా చెప్తే సరే, మరోసారి త్యాగం చేసిన డీకే శివకుమార్
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్
Coromandel Express Accident: నాలుగేళ్లలో 11 వందలకుపైగా ప్రమాదాలు, అన్నింటికీ కారణమదే - కాగ్ రిపోర్ట్
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ