అన్వేషించండి

Karnataka Police Constable Exam Controversy: కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్

Karnataka Police Constable Exam: కర్ణాటక పోలీస్ కాన్‌స్టేబుల్ రాతపరీక్షలో OMR నంబర్ల వివాదం. సోషల్ మీడియా ఫేక్ న్యూస్‌తో అభ్యర్థుల వాకౌట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

OMR Sheet Number Question Paper Match: కర్ణాటక పోలీస్ శాఖలో 1,453 సివిల్ పోలీస్ కాన్‌స్టేబుల్  పోస్టుల భర్తీకి సంబంధించి కర్ణాటక పరీక్షల అధికార సంస్థ  ఆదివారం  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రాతపరీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక చిన్న తప్పుడు ప్రచారం పరీక్షా కేంద్రాల వద్ద గందరగోళాన్ని సృష్టించగా, పలుచోట్ల అభ్యర్థులు పరీక్షను బహిష్కరించి ఆందోళనలకు దిగే వరకు పరిస్థితి వెళ్లింది. విజయపుర జిల్లా తీకోటా శారదాంబ పీయూ కాలేజీ కేంద్రంలో అభ్యర్థులు ఏకంగా వాకౌట్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనంగా మారింది.

అసలు వివాదానికి ప్రధాన కారణం OMR షీట్ నంబర్ ,  ప్రశ్నాపత్రం  నంబర్లు ఒకేలా ఉండాలంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఒక ఫేక్ న్యూస్. శారదాంబ కాలేజీ సెంటర్‌లో పరీక్ష రాయడానికి కూర్చున్న అభ్యర్థులు తమ OMR నంబర్, క్వశ్చన్ పేపర్ నంబర్ వేర్వేరుగా ఉండటాన్ని గమనించి ప్రశ్నించారు. సమాచారం లేకపోవడం, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నిజమని నమ్మిన యువ అభ్యర్థులు   పేపర్ లీక్ లేదా దొంగ మార్గాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉపాధి అవకాశాల కోసం సుదీర్ఘకాలంగా సిద్ధమవుతున్న ఈ తరం యువతలో వ్యవస్థలపై ఉన్న అపనమ్మకం ఈ ఆందోళన రూపంలో బయటపడింది.

సామాజిక మాధ్యమాల్లో నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యే వార్తలను నిజానిజాలు పరిశీలించకుండానే నమ్మే  ఉద్యోగార్థుల ఆందోళన మనస్తత్వం ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తరచూ జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీల వార్తల తో తీవ్ర భావోద్వేగానికి గురైన అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్షా కేంద్రం బయటకు వచ్చి కేకలు వేస్తూ వాకౌట్ చేయడంతో పోలీసులు, పరీక్షల అధికారులు రంగంలోకి దిగి వారిని శాంతింపజేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఈ వివాదం ముదరడంతో కర్ణాటక పరీక్షల అధికార సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  స్పందిస్తూ అధికారిక స్పష్టత ఇచ్చారు. అధికారిక నోటిఫికేషన్‌లోగానీ, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌లోగానీ లేదా ఇన్విజిలేటర్ల మౌఖిక సూచనల్లోగానీ ఎక్కడా OMR నంబర్ ,  క్వశ్చన్ పేపర్ నంబర్ ఒకేలా ఉండాలని పేర్కొనలేదని కేఈఏ స్పష్టం చేసింది. OMR జవాబు పత్రంలో కేవలం క్వశ్చన్ పేపర్ సిరీస్ కోడ్, వెర్షన్ కోడ్ మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని, నంబర్లు మ్యాచ్ కావాలనే నిబంధనే లేదని తేల్చిచెప్పారు.   

సామాజిక మాధ్యమాల్లో నిరూపణ లేని వాస్తవాలను, అసత్య ప్రచారాలను నమ్మి అభ్యర్థులు తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, ఇటువంటి గందరగోళ వార్తలను వ్యాప్తి చేయవద్దని కేఈఏ ప్రజలను, నిరుద్యోగ యువతను కోరింది. సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా వాడకంలో ముందుండే జెన్ జీ యువత ఇటువంటి సున్నితమైన రిక్రూట్‌మెంట్ విషయాల్లో అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని, అనవసరపు పుకార్లకు లొంగి సన్నద్ధమైన పరీక్షలను పక్కనపెట్టడం సరైంది కాదని అంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Police Constable Exam Controversy: కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Prashant Kishor Wins Bankipur Bypoll: పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
Karnataka Cabinet Expansion: కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget