Engine Oil Drinker: ఈయన బండికి కాదు బాడీకి ఇంజిన్ ఆయిల్ లేకపోతే నడవదు - రోజుకు ఏడెనిమిది లీటర్లు తాగేస్తాడట !
Oil Kumar: ఆయన పేరు ఆయిల్ కుమార్. ఆయిల్ అమ్మడు.. తాగుతాడు. అది కూడా ఇంజన్ ఆయిల్. రోజుకు 7-8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతూ 33 సంవత్సరాలుగా బతుకుతున్నానని చెబుతున్నాడు.

Karnataka Oil Kumar Drinks 8 Litres of Engine Oil Daily: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా నివాసి ఒక వ్యక్తిని స్థానికంగా అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతని ఆహారం ఇంజిన్ ఆయిల్ మాత్రమే. సాధువు వేషంలో ఉండే ఈ వ్యక్తి 33 సంవత్సరాలుగా ఏ ఆహారం తీసుకోకుండా కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ , టీతోనే జీవిస్తున్నానని ప్రకటించుకున్నాడు. కొంత మంది అన్నం, చపాతీ ఆఫర్ చేసినా ని తిరస్కరించి, బాటిల్ నుండి నేరుగా ఇంజిన్ ఆయిల్ తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వీడియోలో ‘ఆయిల్ కుమార్’ చుట్టూ కూర్చున్న స్థానికులు అతనికి భోజనం ఆఫర్ చేస్తున్నారు. “అన్నం, చపాతీ తినండి” అంటూ చెప్పినప్పుడు, అతను నవ్వుతూ తిరస్కరిస్తూ, “నేను 33 సంవత్సరాలుగా ఆహారం తీసుకోలేదు. రోజుకు 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీతోనే జీవిస్తున్నాను” అని చెప్పాడు. వీడియోలో అతను బాటిల్ నుండి ఆయిల్‌ను సులభంగా తాగుతున్న దృశ్యాలను చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఆయిల్ కుమార్ శివమొగ్గ జిల్లా సాధారణంగా రోడ్లపై తిరుగుతూ జీవిస్తున్నాడు. స్థానికుల ప్రకారం, అతను ఎప్పుడూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే ఉన్నాడు. “అతను ఎప్పుడూ ఆయిల్ బాటిల్స్‌తోనే కనిపిస్తాడు. మేము ఆఫర్ చేసిన ఆహారాన్ని తిరస్కరిస్తాడు” అని ఒక స్థానికుడు తెలిపాడు.
From Shivamogga, Karnataka, comes the unbelievable story of a man known as "Oil Kumar For the past 33 years, he has refused regular meals like rice or chapati and instead drinks 7 to 8 litres of engine oil every single day, along with cups of tea#Mirage #Kavin #DusuElections2025 pic.twitter.com/nCvCHcxN6b
— TNAHSIN UPDATE (@tnahsinupdate) September 19, 2025
వైద్య నిపుణుల దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఇంజిన్ ఆయిల్‌లో పెట్రోలియం ఆధారిత కాంపౌండ్లు, హైడ్రోకార్బన్లు, హెవీ మెటల్స్ (లెడ్, బెంజిన్ వంటివి) ఉంటాయి. ఇవి అత్యంత విషపు , క్యాన్సర్ కారకాలు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ (AAPCC) ప్రకారం, ఇంజిన్ ఆయిల్ తాగడం వల్ల శ్వాసకోశాల్లోకి ఆయిల్ ప్రవేశించి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇరిటేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వేగంగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ తాగడం అనేది మెడికల్ ఎమర్జెన్సీ అని అంటున్నారు.
आप सोच भी नहीं सकते कि कोई इंजन ऑयल पी कर जीवित रह सकता हैं .
— Anil Meghwal (@anilmeghwal_) September 18, 2025
यह वीडियो कर्नाटक का हैं जिसमें बताया जा रहा हैं कि एक इंसान पिछले कई सालों तक सिर्फ इंजन ऑयल पी रहा हैं इसके अलावा कुछ भी नहीं खाता हैं
इसका नाम भी Oil Kumar पड़ गया हैं
डॉक्टर इसे सेहत के लिए खतरनाक बता रहे हैं pic.twitter.com/t8bMcvg8Ig





















