Praveen Sood: సీబీఐ డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, త్వరలోనే అధికారికంగా బాధ్యతలు
Praveen Sood: కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ని సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Praveen Sood:
కమిటీ ఎంపిక..
ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్‌ని సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ఈ పదవి కట్టబెట్టింది. Personnel and Training విభాగం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ప్రవీణ్ సూద్ అపాయింట్‌మెంట్‌కి సంబంధించిన జీవోని విడుదల చేసింది. ఈ ప్రకటనకు ముందు కమిటీ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత శనివారం (మే 13వ తేదీ) సాయంత్రం సమావేశమయ్యారు. మొత్తం ముగ్గురు IPS అధికారుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ ముగ్గురి పేర్లనూ అపాయింట్‌మెంట్స్ కమిటీకి అందజేసింది కమిటీ. వీరిలో ఒకరి పేరుని ఆ కమిటీ ఫైనలైజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రవీణ్ సూద్‌ని నియమిస్తూ తుదినిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక నుంచే కాకుండా ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన IPS అధికారుల పేర్లు కూడా వినిపించాయి. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలం మే 25న ముగిసిపోనుంది. ఆ తరవాత వచ్చే రెండేళ్ల పాటు ప్రవీణ్ సూద్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1985 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్...ముందు నుంచి ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు. 2021లో మే 26వ తేదీన అప్పటి ముంబయి పోలీస్ కమిషనర్ జైశ్వాల్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి ప్రవీణ్ సూద్ వస్తారు. ఈ పదవీ కాలం రెండేళ్లే అయినప్పటికీ..Central Vigilance Commissioner నియామకానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. లోక్‌పాల్ మెంబర్ నియామకంపైనా కమిటీలో చర్చ జరిగినట్టు సమాచారం.
Praveen Sood has been appointed as the Director of the Central Bureau of Investigation (CBI) for a period of two years: CBI pic.twitter.com/9Wv5MlNoLp
— ANI (@ANI) May 14, 2023
IPS officer Praveen Sood is currently serving as the DGP of Karnataka.
— ANI (@ANI) May 14, 2023