By: Ram Manohar | Updated at : 07 Jan 2023 02:45 PM (IST)
ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌లో ఉన్నట్టుండి ఇళ్లు, రోడ్లు బీటలు వారాయి. (Image Credits: ANI)
Joshimath Sinking:
జోషిమఠ్‌లో ఆందోళన..
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి రోడ్లపై పగుళ్లు వచ్చాయి. సింగ్‌ధార్ వార్డులోని ఓ శివాలయం కుప్ప కూలింది. ఇళ్ల గోడలకూ పగుళ్లు వచ్చాయి. ఫలితంగా..స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందోనని భయపడిపోతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా...ప్రజలు మాత్రం ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే...ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నారు. వైద్య సేవలనూ అందుబాటులో ఉంచనున్నారు. అసలు అకస్మాత్తుగా ఇక్కడి భూమి కుంగిపోవడానికి కారణాలేంటో పరిశీలించాలని కేంద్రం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి స్పందించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులకు ఆదేశించారు. జోషిమఠ్‌ను సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్-మలారీ రోడ్ కుంగిపోవడం సంచలనమైంది. భారత్, చైనా సరిహద్దుని అనుసంధానం చేసే ఈ మార్గం వ్యూహాత్మకమైంది. అందుకే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. "ప్రజల ప్రాణాలను కాపాడడం మా విధి. 600 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఎందుకిలా జరిగిందో ఆరా తీస్తున్నాం. పరిష్కారమూ ఆలోచిస్తున్నాం" అని సీఎం ధమి వెల్లడించారు. ఇప్పటికే సీఎం నేతృత్వంలో ఉన్నతాధికారులతో ఓ సమావేశం జరిగింది. ఇప్పటికే 50 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్ సెసెమిక్ జోన్ Vలో ఉంది. భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలున్న ప్రాంతాన్ని ఈ జోన్‌గా పరిగణిస్తారు. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణమని ప్రాథమికంగా తేలింది.
जोशीमठ में हो रहे भू-धसाव के दृष्टिगत वहां के नागरिकों की सुरक्षा हमारी सर्वोच्च प्राथमिकता है, जिसके लिए SDRF, NDRF, आपदा प्रबंधन एवं जिला प्रशासन की टीम राहत एवं बचाव कार्य में पूरी तत्परता से जुटी हुई है। pic.twitter.com/iVaBdPn326
— Pushkar Singh Dhami (@pushkardhami) January 6, 2023
#WATCH | Uttarakhand: Due to a landslide in the Marwari area of Joshimath, a temple got damaged and fell on top of a residential building. The building was damaged. pic.twitter.com/MwIo34dyav
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 6, 2023
Uttarakhand | Joshimath-Malari border road, connecting the India-China border, develops cracks at several places due to landslides in Joshimath. Strategically important Joshimath-Malari border road subsiding near the Malari taxi stand. pic.twitter.com/t2FUo7Qh12
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2023
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు
Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
Atchannaidu Arrest : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు అరెస్టుకు డిమాండ్
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్