Illegal Mining Case: ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు, సీఎం సోరెన్ సన్నిహితుడి ఇంట్లో AK-47లు
Illegal Mining Case: ఝార్ఖండ్‌లో సీఎం సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
Illegal Mining Case:
అక్రమ మైనింగ్ కేసులో..
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు AK-47 గన్స్‌ని స్వాధీనం చేసుకుంది ఈడీ. అక్రమ మైనింగ్, బెదిరింపుల కేసులో ప్రకాశ్‌కు హస్తం ఉందని అనుమానించిన ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. హర్ము హౌజింగ్ కాలనీలోని ఆయన ఇంట్లో అల్మారాలో AK-47 గన్స్ ఉన్నట్టు గుర్తించారు. అక్రమ మైనింగ్ కేసులో రాంచీలో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన అందరి ఇళ్లనూ టార్గెట్ చేసింది. ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో 17-20 చోట్ల సోదాలు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇప్పటికే ఈ అంశంపై
విచారణ చేపట్టింది. మిశ్రా అసోసియేట్ బచ్చు యాదవ్‌నూ ప్రశ్నించింది ఈడీ. ఆ తరవాత ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ ద్వారా రూ.100 కోట్లు సంపాదించారన్న అనుమానాల నేపథ్యంలో దూకుడు పెంచింది.
ED has recovered AK 47 from the premises of middleman Prem Prakash: Sources
— ANI (@ANI) August 24, 2022
Raids are underway at multiple locations in Ranchi (Jharkhand) in an ongoing investigation in connection with illegal mining and extortion. pic.twitter.com/RFlIxcnOkN
ఆధారాల సేకరణ..
జులై 8వ తేదీన మిశ్రాతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. సాహిబ్‌గంజ్, బర్హెట్, రాజ్‌మహల్, మిర్జా చౌకీ, బర్హర్వా సహా 19 ప్రాంతాల్లో రెయిడ్‌లు నిర్వహించింది. మొత్తం 50 బ్యాంక్ ఖాతాల్లోని రూ.13.32 కోట్లను జప్తు చేసింది. మార్చిలోనే మిశ్రాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (PMLA)కేసు నమోదు చేశారు. అయితే...దీనిపై స్పందించిన పంకజ్ మిశ్రా..తనను అన్యాయంగా ఈ స్కామ్‌లో ఇరికించారని మండి పడ్డారు. అయితే ఈడీ మాత్రం కచ్చితంగా కుంభకోణం జరిగిందని స్పష్టం చేస్తోంది. విచారణలో భాగంగా పలు ఆధారాలు, స్టేట్‌మెంట్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లు సేకరించినట్టు వెల్లడించింది. సాహిబ్‌గంజ్‌లో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు సంపాదించా రనటానికి ఆధారాలున్నట్టు తెలిపింది. అటవీ ప్రాంతంలోనూ మైనింగ్ చేశారని స్పష్టం చేసింది.
నెక్స్ట్ టార్గెట్ ఝార్ఖండ్..?
కొద్ది రోజులుగా భాజపా...తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇలా దాడులు చేయిస్తోందన్న వాదన వినిపిస్తోంది. బిహార్‌లో ఓ వైపు సీబీఐ సోదాలు జరుగుతుండగానే...ఇప్పుడు ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో భేటీ అయ్యారు. కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాలని భావిస్తున్న కేసీఆర్...సోరెన్‌ను కలవటంపై చర్చ జరిగింది. ఇటీవల హేమంత్ సొరేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తి గత కారణాలతో హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఒకసారి హేమంత్ సొరెన్ హైదరాబాద్ లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
ఇటీవల సీఎం కేసీఆర్ కూడా రాంచీ వెళ్లి హేమంత్ సొరేన్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. ఇరువురు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన తర్వాత ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read: Bandi Sanjay : రెండు రోజుల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఆ కుట్ర చేస్తుంది - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు !
Also Read: Bandi Sanjay : రెండు రోజుల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఆ కుట్ర చేస్తుంది - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు !