Bandi Sanjay : రెండు రోజుల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఆ కుట్ర చేస్తుంది - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు !
ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మతకలహాల కుట్రకు ప్లాన్ చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో దీక్ష చేసిన తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay : ప్రజాసంగ్రామ యాత్రను ఆపడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్ర.. అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి ఆపాలని కుట్ర చేశారన్నారు. 21 రోజులు యాత్ర సాగిందని.. రెండు మూడు ప్రాంతాల్లో దాడులు కూడా చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నిరసన దీక్ష కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహింాచారు. ప్రస్తుం గృహనిర్బంధంలో ఉన్న బండి సంజయ్...కరీంనగర్‌లోని తన నివాసంలోనే దీక్ష చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా కరీంనగర్ లో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. pic.twitter.com/dToNdXISyc
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 24, 2022
తన పాదయాత్ర పోలీసుల అనుమతితో జరిగిందన్నారు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ప్రజల బాధలు తెలుసుకోవాల్సిన సీఎం... వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో బాద్యత ఉన్న బీజేపీ ప్రజాసంగ్రామయాత్రను చేపట్టామని గుర్తు చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుక యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రను అడ్డుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. డిల్లీ లిక్కర్ స్కాం దృష్టి మల్లించేందుకు యాత్ర అడ్డుకున్నరన్నా అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ఇది వాస్తవం కూడానని స్పష్టం చేశారు. నా కుటుంబం జోలికి వస్తె పరిస్తితి ఇలా ఉంటుందని వార్నింగ్ వచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
మీ తాత జేజమ్మ లు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని.. రాడ్ లతో వచ్చినా రాళ్లతో వచ్చినా సరే యాత్ర చేసి తీరుతామని ప్రకటించారు. 27 వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతామన్నారు. కుటుంబ పాలన ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూస్తే అర్థమవుతుందన్నారు. డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఎంత నష్టం జరుగుతాయో చూస్తున్నామని.. బిడ్డను కాపాడేందుకు ఇలా చేస్తున్నారని విమర్శఇంచారు. తనను అరెస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలను కొట్టారు. ఎక్కడ ఐటీ దాడులు చేస్తున్నా ప్రతి దాంట్లో వీళ్లే కనిపిస్తున్నారన్నారు. లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, రియల్ ఎస్టేట్, పేకట అన్నింటిలో వాళ్లే కనిపిస్తున్నారని ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో ఎంఐఎంతో కలిసి మతఘర్షణల లేవత్తనున్నారు.. బండి సంజయ్ ఆరోపించారు.
ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బండి సంజయ్ తరపున లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కొసాగించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు హైకోర్టు విచారణ చేయనుంది. పాదయాత్రపై కోర్టు నుంచి అనుమతి వస్తే.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి నేరుగా జనగామ వెళ్లనున్నారు.