ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కుప్ప కూలిన స్టేజ్, పలువురికి తీవ్ర గాయాలు
Pandal Collapse: ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో స్టేజ్ కూలిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Pandal Collapse in Delhi: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి స్టేజ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లని సమీపంలోని సఫ్దర్‌గంజ్‌లోని AIIMS హాస్పిటల్‌కి తరలించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కూలిన స్టేజ్ కింద మరి కొంత మంది చిక్కుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Police say more than 8 people have been injured after a temporary structure installed near Gate number 2 of Jawaharlal Nehru stadium collapsed pic.twitter.com/Dc5sZTwqyb
— ANI (@ANI) February 17, 2024
"ఉదయం 11 గంటల సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఓ పెళ్లి ఫంక్షన్ కోసం స్టేజ్ కడుతున్నారు. ఉన్నట్టుండి అది కూలిపోయింది. గేట్ 2 వద్ద ఈ ప్రమాదం జరిగింది. 8 మంది గాయపడ్డారు. ఈ స్టేజ్ కింద కనీసం 10-12 మంది చిక్కుకుపోయారు. వాళ్లను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. ఇప్పటి వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పోలీస్‌లు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఆంబులెన్స్ సిబ్బంది అందుబాటులోకి వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది"
- ఢిల్లీ పోలీసులు
#WATCH | Personnel of Delhi Fire Services is carrying out a search and rescue operation at the site of pandal collapse on Delhi's Jawaharlal Nehru Stadium premises.
— ANI (@ANI) February 17, 2024
"Today at around 11am, one pandal being installed for a wedding function at Gate 2 of Jawaharlal Nehru Stadium… pic.twitter.com/YKlF16pzev