Jammu Kashmir Encounter: 12 గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ము కశ్మీర్ తుపాకీ తూటాలతో మార్మోగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్ మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
#UPDATE | J&K: Total 5 terrorists killed in dual encounters in Pulwama (4) and Budgam (1) in the last twelve hours. JeM commander terrorist Zahid Wani & a Pakistani terrorist among the killed.
— ANI (@ANI) January 30, 2022
Visuals deferred by unspecified time. pic.twitter.com/xxiNt3Kk1O
రెండు చోట్ల..
కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలోని చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలోవ ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో కూడా ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
భారీగా ఆయుధాలు..
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాల నుంచి భారీ ఎత్తున ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. మృతి చెందిన వారు జేఈఎం, ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
J&K | We were looking for JeM commander Zahid Wani for a long time. On receiving inputs y'day, we launched a search operation followed by an encounter in which Wani & 3 others including Pakistani terrorist Kafil were neutralized, in Pulwama: DGP Dilbag Singh to ANI
— ANI (@ANI) January 30, 2022
(file pic) pic.twitter.com/YIvTx2IQ9s
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి
Also Read: Canada PM Justin: అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని.. వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలతో కెనడా ఉక్కిరిబిక్కిరి