Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి
దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా నమోదయ్యాయి. కొత్తగా 893 మంది కరోనాతో మృతి చెందారు.
![Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి Covid Update: India Continues To Report Around 900 Deaths, Registers 2.34 Lakh Cases In Last 24 Hrs Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/58bd2dce720d191e56459a147ad11eb1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదుకాగా 893 మంది మృతి చెందారు. తాజాగా 3,52,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు: 18,84,937(4.59%)
డైలీ పాజిటివిటీ రేటు: 14.50%
మొత్తం వ్యాక్సినేషన్: 1,65,70,60,692
వ్యాక్సినేషన్..
భారత్లో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది.
దేశంలో 75 శాతానికి పైగా అర్హులైన వారికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
మహారాష్ట్రలో కొత్తగా 27,971 మంది కరోనా సోకింది. 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 61 మంది కరోనాతో మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,83,525కు చేరింది. మరణాల సంఖ్య 1,42,522కు పెరిగింది. మరణాల రేటు 1.85గా ఉంది.
కొత్తగా నమోదైన 85 ఒమిక్రాన్ కేసుల్లో 44 పుణె, 39 ముంబయిలో నమోదయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)