SBI RD Rates: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆర్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ.. సవరించిన రేట్లు ఇవే
SBI Recurring Deposit Interest Rates: ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

SBI RD Rates: భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) తన కస్టమర్లను శుభవార్త అందించింది. ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా రికరింగ్ డిపాజిట్ (SBI Recurring Deposit)పై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు ఆర్‌డీలపై వడ్డీ రేట్లను 5.1 శాతం నుంచి 5.4 శాతం వరకు ఎస్‌బీఐ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు ప్రయోజనం కల్పిస్తోంది. ఎస్‌బీఐ సవరించిన ఆర్‌డీ వడ్డీ రేట్లు ఈ జనవరి 15 నుంచే వర్తించేలా చేస్తామని తెలిపింది.
ఖాతాదారులు తమ పేమెంట్లను వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే ప్రక్రియలో రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) చేసుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే ఇన్‌స్టాల్‌మెంట్ తరహాలో కాకుండా ఒకేసారి చెల్లించేలా ఫిక్స్ చేసుకుంటే మాత్రం అలాగే చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌డీ విధానంలో మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తం నగదు కస్టమర్ తీసుకోవచ్చు. ఆర్‌డీలను తక్కువ మొత్తంలో అంటే కనీసం రూ.100 తో ఆర్‌డీ అకౌంట్ తెరిచే ఛాన్స్ ఎస్‌బీఐలో ఉంది. కనిష్టంగా ఒక్క ఏడాది నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల కాలపరిమితిలో ఎస్‌బీలో ఆర్‌డీ అకౌంట్ తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
2 ఏళ్ల లోపు ఉన్న ఆర్‌డీలకు, 2 నుంచి మూడేళ్ల లోపు ఆర్‌డీల వరకు ఎస్‌బీఐ 5.1 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 2 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల లోపు కాలవ్యవధి ఆర్‌డీలకు 5.3 శాతం వడ్డీ వస్తుంది. 5 నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్లపై కస్టమర్లకు 5.4 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తుంది. టర్మ్ మెచ్యూరిటీ కంటే ముందే ఆర్‌డీ మనీని విత్ డ్రా చేసుకోవాలనుకుంటే,పెనాల్టీ చెల్లించి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించింది ఎస్‌బీఐ.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లు..
ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాటలోనే ఎస్‌బీఐ నడుస్తోంది. రూ.2 కోట్ల కన్నా తక్కువ మొత్తం, ఏడాది నుంచి 2 ఏళ్ల కన్నా తక్కువ కాల పరిమితితో కూడిన ఎఫ్‌డీ (SBI Fixed Deposits)లపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న ఈ వడ్డీరేటు 5.1 శాతానికి సవరించింది. సీనియర్ సిటిజన్లకు 5.5 నుంచి 5.6 శాతానికి పెంచింది. ఈ వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఎస్‌బీఐ 2021, డిసెంబర్లోనే 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. కొత్త బేస్‌రేట్ వార్షిక ప్రాతిపదికన 7.55 శాతంగా ఉంది. దీంతో తక్కువ వడ్డీరేట్ల కాలం ముగిసినట్టేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది రుణ గ్రహీతలకు బేస్‌రేట్‌గానూ పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో మొత్తం వడ్డీరేట్ల దిశకు చిహ్నంగా పనిచేస్తుంది. బేస్ రేట్ పెరుగుతుందంటే తక్కువ వడ్డీరేట్ల ట్రెండ్ పోయినట్టేనని అంటున్నారు. రానురాను ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!





















