అన్వేషించండి

Abd al-Hadi Sabah: డ్రోన్ దాడిలో హమాస్ కమాండర్ హతం - అక్టోబర్ 7 దాడి మాస్టర్ మైండ్ ఇకలేడు- ఇజ్రాయెల్ ఫోర్సెస్

Abd al-Hadi Sabah : అక్టోబరు 2023లో కిబ్బట్జ్ నిర్ ఓజ్ దాడికి కారణమైన హమాస్ కమాండర్‌ని ఇజ్రాయెల్ దాడి చేసి, హతమార్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి.

Abd al-Hadi Sabah : హమాస్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. హమాస్ కమాండర్ అబ్ద్ అల్-హదీ సబాను అంతమొందించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ - ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలోని ఖాన్ యూనిస్ లో శరణార్ధులు సహాయం పొందుతోన్న ప్రాంతంలో సబాను గుర్తించి, డ్రోన్ తో దాడి చేసినట్టు తెలిపింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై నిర్వహించిన దాడుల్లో అల్-హదీ సబా కీలకంగా వ్యవహరించాడు. 

సబా- కీలక సూత్రధారి

'అక్టోబరు 7 దాడుల వెనుకున్న కీలక సూత్రధారి, హమాస్ టాప్​ కమాండర్ అబ్దల్‌ హదీ సబాను హతమార్చాం. సబా అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించాడు. ఆ నాటి దాడులకు కారకులైన మిగతా వారిని సైతం హతమార్చే వరకు మా ఆపరేషన్‌ను కొనసాగిస్తాం' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అంతకుముందు గతేడాది జనవరిలో హమాస్‌ నాయకుడు సలేహ్‌ అరౌరీని కూడా తామే హతమార్చామని ఇజ్రాయెల్‌ ధృవీకరించింది. లెబనాన్‌పై జరిగిన దాడుల్లో హమాస్‌ డిప్యూటీ పొలిటికల్‌ హెడ్‌, మిలిటెంట్‌ వింగ్‌ వ్యవస్థాపకుడు అరౌరీతో సహా మరో ఐదుగురు హతమయ్యారు. 

'అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి

అక్టోబరు 7, 2023న హమాస్.. ఇజ్రాయెలీ కిబ్బట్జ్‌ నిర్ ఓజ్ పై తీవ్ర దాడికి పూనుకుంది. ఈ దాడిలో దాదాపు 12వందలకు పైగా మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగకుండా హమాస్ 251 మందిని బంధించి గాజాకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదల చేసింది. అయినప్పటికీ ఇంకా 97మంది హమాస్ బంధీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం వారిలో 51మంది మాత్రమే బతికి ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. హమాడ్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541మంది ప్రాణాలు కోల్పోగా.. 1,08,338 మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు ప్రతీకారదాడులతో పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక చోట ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ పరస్పక దాడులకు దిగుతున్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది. ఈ దాడుల్లో రెండు గ్రూపులకు చెందిన కీలక నేతలు చనిపోయారు. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతమయ్యారు.

Also Read : China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget