Trump Fear: 20వ తేదీలోపు అమెరికా వచ్చేయండి - H1B వీసా హోల్డర్లకు కంపెనీల పిలుపు - ట్రంప్ భయమే కారణం !
Indian H-1B holders: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయం దగ్గర పడటంతో ఐటీ కంపెనీలు అప్రమత్తమవుతున్నాయి. 20వ తేదీలోపు H1B వీసా హోల్డర్లు అమెరికా చేరుకోవాలని సందేశాలు పంపాయి.
Indian H-1B holders get the jitters told to be in US before January 20: జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన వీసా పాలసీలపై ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హెచ్‌వన్ బీ వీసాలపై నియంత్రణ విధిస్తారన్న ప్రచారంతో ఎక్కువ మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాలను స్పాన్సర్ చేసిన కంపెనీలు భార్త లో ఉన్న తమ వారిని జనవరి 20లోగా అమెరికాకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టాగనే నిబంధనల మారుస్తారని ఈ కారణంగా వారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా ముందే వచ్చేయమని పిలుపునిస్తున్నాయి.
వీసాల రెన్యూవల్‌కు ఇండియాకు రావాల్సిన అవసరం లేదని అమెరికా ప్రకటన
నిజానికి ఇప్పటి వరకూ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ఇండియాకు రావాల్సి వచ్చేంది.ఇప్పుడు ఆ అవసరం లేదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం డిసెంబర్ 27న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. హెచ్-1బీ వీసాదారుల కోసం అమెరికా ఆధారిత రెన్యువల్ ప్రోగ్రామ్ ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక వృత్తుల్లో ఉన్న అనేక మంది భారతీయ కార్మికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తమను అమెరికా విడిచి వెళ్లవద్దని.. అమెరికా బయట ఉన్న వారిని వచ్చేయాలని కోరారని పలువురు హెచ్-1బీ వీసా హోల్డర్లు చెబుతున్నారు.
హెచ్ వన్ బీ వీసాల జారి తగ్గిపోతున్న సూచనలు
అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయు వలస ప్రజలు ఎక్కువగా ఉన్నారు. భారత టెక్ నిపుణులు హెచ్-1బీ వీసాల ద్వారా ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీతో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అమెరికన్ టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలకు కీలకంగా మారింది. అమెరికా మంజూరుచేసినా 320,000 హెచ్ -1 బి వీసాలలో 77% భారతీయ పౌరులు పొందారు. ఇటీవలి కాలంలో హెచ్-1బీ వీసాలు తక్కువగా జారీ అవుతున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపి) ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో టాప్ 7 భారతీయ ఐటి కంపెనీలు కొత్త నియామకాల కోసం 7,299 హెచ్ -1 బి వీసా అనుమతులను మాత్రమే పొందాయి.
ట్రంప్ హయాంలో అనేక సమస్యలు తప్పవనుకుంటున్న ఎన్నారైలు
అనిశ్చితి ఉన్నప్పటికీ చాలా మంది నిపుణులు అధిక జీతాలు, మెరుగైన జీవన నాణ్యత కోసం యుఎస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ట్రంప్ విధానం అమెరికాలో ఉద్యోగాలు పొందడానికి వచ్చే వారిని పూర్తిగా నియంత్రించడం అందుకే ఖచ్చితంగా కఠినమైన ఆంక్షలు పెడతారని అంచనా వేస్తున్నారు.
Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?