రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం, బ్రిజ్ భూషణ్‌కి బెయిల్ మంజూరు
Wrestlers' Sexual Harassment Case: రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Wrestlers' Sexual Harassment Case:
బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనతో పాటు ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ సింగ్‌కి కూడా బెయిల్ లభించింది. మహిళా రెజ్లర్లు పెట్టిన లైంగిక ఆరోపణల కేసులో వీరికి బెయిల్ దొరికింది. పర్సనల్ బాండ్ కింద రూ.25వేలు కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసుల తరపున వాదించిన లాయర్...బెయిల్‌ని తాను సమర్థించడం లేదని, అలాగని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని తెలిపారు. అయితే...అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ మాత్రం దీనిపై అసహనం వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌కి బెయిల్ మంజూరు చేసే క్రమంలో కొన్ని కండీషన్స్ పెట్టాలని కోరారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని అన్నారు. గత వారమే ఢిల్లీకోర్టు బ్రిజ్ భూషణ్‌తో పాటు తోమర్ సింగ్‌కి రెండ్రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్‌పై ఏడుగురు మహిలా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై సెక్షన్స్ కింద 354, 354A, 354D కింద కేసులు నమోదు చేశారు. వేధింపులు ఎదుర్కొన్న వారిలో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఉండడం వల్ల పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఆ తరవత ఆ మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంది. ఫలితంగా ఆ కేసు కొట్టేయాల్సి వచ్చింది.
#WATCH | Delhi: Former Wrestling Federation of India (WFI) chief and BJP MP Brij Bhushan Sharan Singh arrives at Rouse Avenue Court.
— ANI (@ANI) July 20, 2023
Hearing on his regular bail plea in the case of alleged sexual harassment of wrestlers will be held today. pic.twitter.com/P5NyU8yCCD
ఇదీ జరిగింది..
WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు నిందితులపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులతోపాటు, పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు చేసిన మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పొక్సో కేసును తొలగించారు.రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా దాదాపు 1,599 పేజీల భారీ చార్జిషీటును దాఖలు చేశారు. రెజ్లర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్రిజ్ భూషణ్ సింగ్ విచారణ, శిక్షార్హుడుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితులకు సమన్లు జారీ చేసింది. బ్రిజ్ భూషణ్‌తోపాటు వినోద్ తోమర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకుండా బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు.