World Most Polluted City: మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ, ఈ కాలుష్య కాసారంలో జీవిస్తే 11.9 ఏళ్ల ముందే చనిపోతారు
World Most Polluted City: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమైన ఢిల్లీలో నివసించే వారి జీవితకాలం 11.9 ఏళ్లు తగ్గిపోతున్నట్లు వెల్లడైంది.
World Most Polluted City: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే.. ఢిల్లీ నగరంలో నివసించే పౌరుల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్.. ఢిల్లీ కాలుష్యంపై ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే ఢిల్లీ నగరంలో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
భారత దేశంలో 67.4 శాతం మంది ప్రజలు.. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి జీవిత కాలం 5.3 ఏళ్లు తగ్గిపోతున్నట్లు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఉన్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోబోతున్నారని పేర్కొంది.
పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాను అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించిన షికాగో వర్సిటీ నివేదిక.. అక్కడ కూడా కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ప్రమాణాల ( పీఎం 2.5) కంటే 7 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే తీవ్రమైన కాలుష్యం స్థాయిలు కొనసాగితే.. పఠాన్ కోట్ జిల్లా ప్రజల వయస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక అంచనావేసింది.
Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!
ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యానికి భౌగోళిక, వాతావరణ అంశాలు కారణంగా చూపింది. అయితే మానవ ప్రమేయంతో కూడా బారీ స్థాయిలో కాలుష్యం పెరుగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తేత ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా సాంద్రత మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీని వల్ల వాహనాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కాలుష్యం వల్ల భారత్ తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి 6 ఏళ్లకు పైగా తమ జీవిత కాలాన్ని కోల్పోతున్నట్లు ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
NEW 2023 #AQLIReport makes clear that PM2.5 is the world’s greatest external risk to human health. The impact on life expectancy is comparable to:
— Air Quality Life Index (AQLI) (@UChiAir) August 29, 2023
🚬 Smoking
🍷 >3x alcohol use & unsafe water
🚗 >5x transport injuries
🩸>7x HIV/AIDS
Learn more:
In Bangladesh, India, Nepal and Pakistan, our 2023 #AQLIReport reveals that residents are expected to lose about 5 years off their lives on average if the current high levels of #AirPollution persist.
— Air Quality Life Index (AQLI) (@UChiAir) August 29, 2023
Learn more: