అన్వేషించండి

PM Road Accident Relief Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

PM Rahat Yojana | ప్రధానమంత్రి సహాయ పథకం కింద, ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల వరకు ఒక్కొక్కరికి ఆస్పత్రి ఖర్చులు ₹1.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది.

PM Rahat Yojana Cashless Treatment | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానినరేంద్ర మోదీ 'పీఎం రాహత్' (PM Rahat) పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి 7 రోజుల పాటు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందుతుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలోని ఏ కేటగిరీ రహదారిపై ప్రమాదం జరిగినా, అర్హులైన ప్రతి బాధితుడికి PM Rahat Yojana పథకం వర్తిస్తుంది. అంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు లేదా గ్రామీణ రోడ్లు - ఇలా ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగినా బాధితులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. పీఎం రాహత్ పథకం కింద ఎవరికైనా సరే ప్రమాదం బాధితులకు నిర్ణీత మొత్తం వరకు ఉచిత చికిత్స అందుతుంది. అయితే పథకం రూల్స్ ఇక్కడ తెలుసుకోండి. 

పీఎం రాహత్ పథకానికి సంబంధించిన రూల్స్ 
పీఎం రాహత్ పథకం కింద, ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు ఒక్కో వ్యక్తికి 1.5 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ చెల్లింపు నేరుగా మోటారు వాహనాల ప్రమాద నిధి (Motor Vehicle Accident Fund) నుండి ఆసుపత్రికి వెళ్తుంది. ఈ పథకం కింద ప్రాణాపాయం లేని కేసుల్లో గరిష్టంగా 24 గంటల వరకు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల వరకు 'స్టెబిలైజేషన్' చికిత్స అందించనున్నారు. ఆ తర్వాత కూడా 7 రోజుల వ్యవధిలోపు క్యాష్‌లెస్‌ చికిత్స అందుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి పోలీసు ధృవీకరణ అవసరం అవుతుంది. సాధారణ కేసుల్లో 24 గంటల లోపు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల లోపు పోలీసుల నిర్ధారణ జరగాలి. తద్వారా చికిత్స అందించడంలో ఎటువంటి ఆటంకం కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుంది. 

గోల్డెన్ అవర్‌లో చికిత్సపై ప్రాధాన్యత
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో చాలా మంది సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే చనిపోతున్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చగలిగితే సుమారు 50 శాతం మరణాలను నివారించవచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ లక్ష్యంతోనే 112 హెల్ప్‌లైన్ ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులు, బాటసారులు లేదా అక్కడ ఉన్న ఎవరైనా సరే 112 నెంబర్‌కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను తెలుసుకోవచ్చు. బాధితుల కోసం అంబులెన్స్ సహాయం కోరవచ్చు.

ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా బాధితుడి పరిస్థితి విషమంగా ఉంటే, మెరుగైన చికిత్సను వారి వ్యక్తిగత భీమా (Health Insurance) లేదా ఇతర ప్రభుత్వ పథకాల (ఆయుష్మాన్ భారత్ వంటివి) కిందకు మార్చుకునే వీలుంది. పీఎం రాహత్ పథకం అమలులో నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కీలక పాత్ర పోషిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget