Viral News: మొబైల్ వాడొద్దని మందలించిన తల్లిదండ్రులు, వాటర్‌ఫాల్స్‌లోకి దూకి బాలిక ఆత్మహత్యాయత్నం
Viral Video: తల్లిదండ్రులు మందలించారన్న కోపంతో ఛత్తీస్‌గఢ్‌లో ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.
Viral News:
చిత్రకూట్ వాటర్‌ఫాల్స్ వద్ద ఘటన..
ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్ వాటర్‌ఫాల్స్‌లోకి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 90 అడుగుల ఎత్తులో నుంచి ఆమె దూకుతుండగా అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్తర్‌లోని చిత్రకూట్ చౌకీ ప్రాంతంలో ఇది జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని సరస్వతి మౌర్యగా గుర్తించారు. మొబైల్ ఎక్కువగా వాడుతోందని తల్లిదండ్రులు వారించినందుకు ఇలా సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె దూకిన వెంటనే బోట్‌లో కొందరు వెళ్లి ఆమెని కాపాడారు. కొండపై నిలబడి నీళ్లలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నప్పుడే అక్కడి వాళ్లు ఆమెని వారించారు. దూకొద్దు అని గట్టిగా కేకలు వేశారు. వాళ్లందరినీ చూసిన ఆమె వెంటనే నీళ్లలోకి దూకేసింది. భారీ వర్షాల కారణంగా బస్తర్‌లో నదులు ఉప్పొంగుతున్నాయి. దాదాపు 30 గంటల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బస్తర్‌కి లైఫ్‌లైన్‌గా ఉండే ఇంద్రావతి నదిలో నీటిమట్టం పెరిగిపోయింది. ఈ కారణంగా చిత్రకూట్ వాటర్‌ఫాల్స్ మరింత ఉద్దృతంగా మారింది. మినీ నయాగరా వాటర్‌ఫాల్స్‌గా దీన్ని పిలుచుకుంటారు.
girl jumps from a height of 90 foot into the Chitrakote Waterfalls after her parents scolded her for using mobile phone. She, however, survived the plunge and emerged a few metres away.#Chhattisgarh #chitrakotewaterfalls #mobile #waterfallspic.twitter.com/WEkVxJq8HN
— Priyathosh Agnihamsa (@priyathosh6447) July 19, 2023
హరియాణాలో హత్య..
జూన్‌లో హరియాణాలోని (Haryana Crime News) బల్లబగర్‌లో దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలిక 12 ఏళ్ల తన తమ్ముడిని కిరాతకంగా హత్య చేసింది. తల్లిదండ్రులు తన కన్నా తమ్ముడిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారన్న కోపంతో చంపేసింది. తల్లిదండ్రులిద్దరూ పని చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన సమయానికి కొడుకు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. పడుకున్నాడేమో అనుకుని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. పైన బెడ్ షీట్‌ని తొలగించి చూశారు. గొంతుపై లోతైన గాయాన్ని చూసి షాక్ అయ్యారు. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని, తమ్ముడిపైనే వాళ్లకు ప్రేమ ఎక్కువగా ఉందని చెప్పింది. ఈ కోపంతోనే తమ్ముడిని చంపేసినట్టు అంగీకరించింది. ఈ ఇద్దరు పిల్లలూ యూపీలోని నాయనమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఎండాకాలం సెలవులు రావడం వల్ల ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగానే చూసినా...కూతురు మాత్రం కక్ష పెంచుకుంది. తమ్ముడు ఫోన్ ఇవ్వకుండా గొడవ పడటం వల్ల కోపంతో హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు."తల్లిదండ్రులు అబ్బాయికి ఫోన్ ఇచ్చారు. రోజంతా ఆ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. ఫోన్ ఇవ్వమని ఎంత అడిగినా ఇవ్వలేదు. దీంతో తమ్ముడిపై అక్క కోపం పెంచుకుంది. గొంతు కోసి చంపేసింది"
- పోలీసులు