Viral News: బిహార్‌లో షాకింగ్ ఘటన- బాలుడ్ని కాటేసి వెంటనే చనిపోయిన పాము!
Viral News: పాము కాటేసినా ఓ బాలుడికి ఏం కాలేదు. అంతేకాదు బాలుడ్ని కాటేసిన ఆ పాము నిముషాల్లోనే చనిపోయింది.
Viral News: సాధారణంగా పామును చూస్తేనే అందరూ ఉలిక్కిపడతారు. అలాంటిది పాము కాటేస్తే.. ఇంకేముంది ప్రాణాలు కోల్పోవడం తప్ప అని అనుకుంటున్నారు కదా! కానీ బిహార్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోయింది.
ఇదీ జరిగింది
బిహార్‌లోని మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కోట్లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.
అయితే ఎప్పటిలానే అనూజ్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ పామును బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు.
షాకింగ్ ఘటన
ఇది విన్న తల్లి వెంటనే అనూజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. కానీ ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడిని కాటు వేసిన పాము చనిపోయి ఉంది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. ఈ పామును ఫొటోలు తీసి చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అసలు పాము కరిచిన బాలుడికి ఏం కాకపోవడం వింతగా ఉందని స్థానికులు, నెటిజన్లు అంటున్నారు. బాలుడికి ఏం కాకపోవడం ఒక వింత అయితే, చిన్నారిని కరిచి పాము చనిపోవడం మరో వింతగా ఉందని అంటున్నారు. అసలు ఇది ఎలా జరిగింది? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు- 38 మంది మృతి