Viral News: 'దీపావళి రోజున రాముని వేషధారణలో వస్తారా?' - శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ, కట్ చేస్తే!
Indore News: క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీ చేసిన యువకుడిని హిందూ జాగరన్ మంచ్ నాయకుడు నిలదీశారు. దీంతో సదరు యువకుడు ఆ డ్రెస్ విప్పేశాడు.
Zomato Food Delivery Boy Supply Food With Wearing Santaclaus Dress In Indore: ఓ ఫుడ్ డెలివరీ బాయ్ క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ చేశాడు. దీన్ని గమనించిన హిందూ జాగరన్ మంచ్ నాయకుడు సదరు డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. దీంతో సదరు యువకుడు ఆ డ్రెస్ తీసేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లో ఓ జొమాటో డెలివరీ బాయ్ క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్ దుస్తులు ధరించి వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేశాడు. దీన్ని చూసిన హిందూ జాగరన్ మంచ్ ఇండోర్ అధ్యక్షుడు సుమిత్ హర్దియా అతన్ని అడ్డుకున్నారు. ఎందుకిలా డ్రెస్ వేసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నావంటూ నిలదీశారు. కంపెనీ ఆదేశాలతోనే ఇలా చేసినట్లు సదరు డెలివరీ బాయ్ చెప్పగా.. 'దీపావళి రోజున ఎప్పుడైనా రాముని వేషం వేసుకుని ఫుడ్ డెలివరీ చేశారా.?' అని ప్రశ్నించారు.
దీంతో సదరు డెలివరీ బాయ్ ఆ దుస్తులను తీసేశాడు. మనం హిందువులం.. ఇలాంటి దుస్తులు వేసుకుని చిన్నారులకు ఏం సందేశం ఇస్తున్నామని సుమిత్ ప్రశ్నించారు. అలాంటి సందేశం ఇవ్వాలనుకుంటే శాంటాక్లాజ్ దుస్తులు తప్పనిసరా అని నిలదీశారు. అలాంటప్పుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌లా కూడా దుస్తులు ధరించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read: Lamborghini: నడిరోడ్డుపై రూ.కోట్ల విలువైన కారు దగ్ధం - ముంబైలో షాకింగ్ ఘటన, వైరల్ వీడియో