Rana : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ - ఎంక్వైరీ తర్వాత రానా రియాక్షన్
Rana Reaction : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ హీరో రానాను సీఐడీ అధికారులు విచారించారు. తన లీగల్ టీం పూర్తిగా వెరిఫై చేశాకే యాప్ ప్రమోట్ చేశానని వివరించారు.

Rana Reaction On Betting Apps Promotions : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్ హీరో రానాను సీఐడీ విచారించింది. తన బ్యాంకు వివరాలను సీఐడీ అధికారులకు అందించిన రానా... స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పారు. గంటన్నర పాటు ఆయన్ను సీఐడీ విచారించింది.
చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే దానికి ప్రచారం చేశానని తెలిపారు. 'నా లీగల్ టీం పూర్తిగా వెరిఫై చేసింది. ఆ తర్వాతే ఆ యాప్‌ను ప్రమోట్ చేశాను. పూర్తి వివరాలను సీఐడీ అధికారులకు వివరించాను. విచారణకు పూర్తిగా సహకరించా.' అంటూ మీడియాకు రానా వెల్లడించారు.
Also Read : 'శివ' రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేశాయంతే - ఎన్నేళ్లైనా కింగ్ జోష్ తగ్గేదేలే... అప్పటితో పోలిస్తే...
ఇటీవల బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ యాప్స్ నిర్వాహకులపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో స్పెషల్ సిట్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు సహా పలు యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌తో పలువురిని విచారించి వారి నుంచి వివరాలు సేకరించిన సిట్... తాజాగా రానాను సైతం విచారించింది. ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా శనివారం విచారణకు హాజరయ్యారు.





















