Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్
Maharashtra Political Crisis: శివసేన సర్కార్‌కు మరో షాక్ తగిలింది. షిండే సారథ్యంలోని రెబల్ క్యాంప్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ పతనం అంచుల్లో ఉంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం నుంచి సొంత నివాసం మాతోశ్రీకి వెళ్లిపోయారు. మరోవైపు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబల్స్ క్యాంప్‌లో ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగింది. గురువారం ఉదయం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ క్యాంప్‌లోకి జంప్ అయ్యారు
#WATCH | Assam: Rebel Maharashtra MLAs camping at Radisson Blu Hotel in Guwahati meet former MoS Home and Shiv Sena leader Deepak Kesarkar. pic.twitter.com/SoEQNt9sPZ
— ANI (@ANI) June 23, 2022
46 మంది
బుధవారం రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు క్యాంప్‌లో చేరారు. దీంతో 24 గంటల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే చెంతన చేరారు. రెబల్స్ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 46కుపెరిగింది. వీరిలో స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా గువాహటిలోని రాడీసన్ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు.
గవర్నర్‌కు లేఖ
శివసేన పక్షనేతగా ఏక్‌నాథ్ షిండే కొనసాగుతారని రూపొందించిన తీర్మానాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఆమోదించారు. ఈ మేరకు 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీకి పంపించారు.
[quote author= ఏక్‌నాథ్ షిండే]మహా వికాస్ అఘాడీ ఒక అసహజమైన కూటమి. శివసేన తన కోసం, తన పార్టీ కార్యకర్తల కోసం ఆ కూటమి నుంచి బయటకు రావడం తప్పనిసరి. రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. మేం అదే చేశాం.
టీఎంసీ ఆందోళన
Assam | TMC leaders & workers protesting outside Radisson Blu Hotel in Guwahati are being detained by Police
— ANI (@ANI) June 23, 2022
A worker says, "Around 20 Lakh people in Assam are suffering due to the flood. But CM is busy toppling Maharashtra Govt"
Rebel Maharashtra MLAs are staying at the hotel. pic.twitter.com/Si7xf4BdJR
మరోవైపు ఏక్‌నాథ్ షిండే బృందం నివాసం పొందుతోన్నరాడీసన్ బ్లూ హోటల్‌ను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు- 38 మంది మృతి
Also Read: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీస్ కాదు కలెక్షన్ కింగ్, ఆరు గంటల్లో రూ. 6లక్షలు వసూలు