అన్వేషించండి

Viral News: ఇది అట్టాంటి, ఇట్టాంటి చేప కాదు బ్రో- డైనోసార్ల కాలం నాటి అరుదైన చేప!

పాతాళ లోచ్ చేప.. దీని గురించి చాలా మందికి తెలియదు. 2020లో ఈ చేపను తొలిసారి కేరళలో గుర్తించారు.

Viral News: పాతాళ లోచ్ చేప.. దీని గురించి చాలా మందికి తెలియదు. 2020లో ఈ చేపను తొలిసారి కేరళలో గుర్తించారు. సంస్కృత పదం పాతాల ఆధారంగా పాతాల ఎల్‌లోచ్ అని పేరు పెట్టారు. పామును పోలి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఈ జాతి చేపలు భూగర్భ జలాలు ఉండే రాళ్లు, భారీ భూ పొరల్లో ఎక్కువగా ఉంటాయి. భారత్‌లో ఇలాంటివి దాదాపు 20 వరకూ ఉండొచ్చు. ఇందులో 11కు పైగా జాతులు కేరళలో గుర్తించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీవ్ రాఘవన్ తెలిపారు. ఈ చేపలు ప్రత్యేకమైనవని కేవలం భారత్, చైనా, మెక్సికో వంటి ప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తాయని రాఘవన్ వివరించారు. భూగర్భ జలాల్లో ఉండే ఈ చేపలు బోర్ల ద్వారా పైకి వచ్చినప్పుడు, వేసవిలో బావులు అడుగంటినప్పుడు  మాత్రమే కనిపిస్తాయని చెప్పారు.

1950 వరకూ ఎవరికీ తెలియదట
దేశం మొత్తం మీద కేరళలోనే బావులు అధికంగా ఉంటాయి. దాదాపు 70 లక్షలకు పైగా బావులు ఉంటాయి. అందుకే ఈ భూగర్భ చేపల సంఖ్య ఎక్కువగా కేరళలోనే గుర్తించారు. 1950 వరకు వీటి గురించి ఎవరికీ తెలియదని శాస్త్రవేత్తలు తెలిపారు. 2015లో ఒక ప్రాజెక్టుకు సంబంధించి కేరళ ఫిషరీస్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ  అధ్యయనం చేస్తుండగా కేరళలో భూగర్భ జాతుల చేపల గురించి తెలిసింది. దీంతో బావులు, కొళాయిల ద్వారా భూగర్భ చేపలు బయటకు వస్తాయని వర్సిటీ అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకమైన, కొత్త రకం చేపలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అలా దాదాపు 13 జాతులకు చెందిన 150 నమూనాలను వర్సిటీ అధికారులు సేకరించారు. 

డైనోసార్ల కాలం నాటి చేప.. కేరళలో లభ్యం
ఇలా కేరళలో దొరికిన చేపల్లో ఒక దానిపై పరిశోధన, అధ్యయనం చేయగా ఆ చేప దాదాపు 12.5 కోట్ల ఏళ్ల నాటిదని గుర్తించారు. ఆకాలంలో భూమిపై డైనోసార్లు తిరిగేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం భూగర్భంలో ఉంటున్న చేపలు కోట్ల ఏళ్లనాటివని చెప్పారు. మూడేళ్ల క్రితం కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన  అబ్రహం ఈ చేపలను తొలిసారి గుర్తించారు. స్నానం చేస్తున్నప్పుడు బకెట్‌లో ఎర్రటి దారం ఆకారంలో కదులుతున్న చేపను గుర్తించి దానిని గాజు సీసాలో భద్రపరిచారు. దానిని డాక్టర్ బినోయ్ థామస్ అనే ప్రొఫెసర్‌ సాయంతో కేరళ ఫిషరీస్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ పరిశోధకులను కలిశారు. దానిని పలిశీలించిన వారు ఇది కొత్త జాతి చేపగా నిర్ధారించారు. తరువాత అబ్రహం‌కు చెందిన బావి, నీటి ట్యాంకుల్లో కొన్ని వారాల పాటులో ఇలాంటి జాతి చేపలను వారు గుర్తించారు. 

హాలీవుడ్ స్టార్, పర్యావరణ ప్రేమికుడు డికాప్రియో పాతాళ లోచ్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పాతాళ లోచ్ చేపను గుర్తించిన అబ్రహంను ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై అబ్రహం స్పందిస్తూ డికాప్రియో లాంటి గొప్ప వ్యక్తి తనను అభినందించడం సంతోషంగా ఉందన్నారు.  అది తనకు గర్వంగా ఉందన్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget