By: ABP Desam | Updated at : 17 Jul 2022 05:21 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మార్గరేట్ అల్వా(ఫైల్ ఫొటో)
Vice President Candidate : విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వా పేరును విపక్షాల తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి. ఆదివారం దిల్లీలో సమావేశమైన విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించాయి. కర్నాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అల్వా పేరును ఫైనల్ అయింది. విపక్షాల పార్టీల సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. మార్గరెట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. పశ్చిమ బెంగాలు గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్ ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
Delhi | Opposition's candidate for the post of Vice President of India to be Margaret Alva: NCP chief Sharad Pawar pic.twitter.com/qkwyf7FMOw
— ANI (@ANI) July 17, 2022
మార్గరెట్ అల్వా ప్రస్థానం
మార్గరెట్ అల్వా ఏప్రిల్ 14, 1942 లో జన్మించారు. ఆమె గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ఆమె కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మార్గరెట్ అల్వా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఆమె పనిచేశారు. ఆమె అత్తగారు వైలెట్ అల్వా, 1960లలో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. మార్గరెట్ అల్వా 14 ఏప్రిల్ 1942లో కర్ణాటకలోని మంగళూరులో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు.
ఆగస్టు 16న ఉపరాష్ట్రపతి ఎన్నిక
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగష్టు 10వ తేదీతో ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. జులై 19వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసినందుకు అవకాశం ఉంది.
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ
Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?