NDA Vice President Candidate : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ ఖర్, ప్రకటించిన జేపీ నడ్డా
NDA Vice President Candidate : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. జగన్ దీప్ ధన్ ఖర్ ప్రసుత్తం పశ్చిమ బంగాల్ గవర్నర్ గా ఉన్నారు.
NDA Vice President Candidate : ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్ దీప్ ధన్ ఖర్ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని జగ్ దీప్ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు.
Shri Jagdeep Dhankhar Ji has excellent knowledge of our Constitution. He is also well-versed with legislative affairs. I am sure that he will be an outstanding Chair in the Rajya Sabha & guide the proceedings of the House with the aim of furthering national progress. @jdhankhar1 pic.twitter.com/Ibfsp1fgDt
— Narendra Modi (@narendramodi) July 16, 2022
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగష్టు 10వ తేదీతో ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. జులై 19వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసిందుకు అవకాశం ఉంది.
भाजपा और NDA उपराष्ट्रपति पद के लिए प्रत्याशी किसान पुत्र श्री जगदीप धनखड़ जी को घोषित करती है।
— BJP (@BJP4India) July 16, 2022
श्री जगदीप धनखड़ जी पश्चिम बंगाल के अभी गवर्नर हैं और लगभग तीन दशक तक सार्वजनिक जीवन में काम किया है।
- श्री @JPNadda pic.twitter.com/3jfhrpJ6XQ
జగ్ దీప్ ధన్ ఖర్ ప్రస్థానం
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్‌ను ఎంపిక చేసింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో ఆయన పేరును ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ధన్‌ఖర్ చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి LLB చదివారు. ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా నిలిచారు. ధన్ ఖర్ రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్
1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝను నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ధన్‌ఖర్ ఎన్నికయ్యారు. ధన్ ఖర్ జులై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆ పదవికి నామినేషన్ వేయడానికి జులై 19 చివరి తేదీ. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.