CJP వల్ల BJPకి 90 శాతం డ్యామేజ్ జరుగుతుందని వేణు స్వామి హెచ్చరించారు. రెండు పార్టీల జాతకాల మధ్య అశుభకరమైన స్థానాలు ఉండటమే దీనికి కారణమని వివరించారు.
Venu Swamy Prediction: బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్ జనతా పార్టీ.. త్వరలో జైలుకు సీజేపీ నేతలు: వేణు స్వామి జోస్యం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తాను చెప్పిన జోస్యం నిజమైందని వేణు స్వామి పేర్కొన్నారు. సీజేపీ వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో సీజేపీ నేతలు జైలుకు వెళ్తారని చెప్పారు.

- భవిష్యత్ భారత రాజకీయాలను CJP 60 శాతం ప్రభావితం చేస్తుంది.
హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన మాటే నిజమైంది. ఇప్పటికే తాను చెప్పినట్లుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నిజమైందని గుర్తు చేశారు. తొలి ఏకాదశికి ముందే ఓ వీడియోలో మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా కాక్రోజ్ జనతా పార్టీ (సిజేపీ) జాతకాన్ని విశ్లేషించారు. ఈ పార్టీ సింహ లగ్నంలో ఉందని, రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ యోగం కారణంగానే సిజేపీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, పబ్లిసిటీ, అటెన్షన్ లభిస్తున్నాయని ఆయన వివరించారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో ఉందని, 2026 అక్టోబర్ 31 వరకు వీరికి అద్భుతమైన ప్రజాదరణ ఉంటుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. రాశి చక్రం ప్రకారం, సిజేపీకి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల విపరీత రాజయోగం కనిపిస్తోందని వేణు స్వామి తెలిపారు. ఈ పార్టీని అణచివేయాలని చూస్తే అది రివర్స్ అవుతుందని, వారిని అగ్రెసివ్ గా కాకుండా చాలా పద్ధతిగా, ప్రేమతో హ్యాండిల్ చేయాలని సూచించారు. అయితే, కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ పార్టీ నాయకులలో కొంత తొందరపాటు, యాంగ్జైటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు
త్వరలో జైలుకు వెళ్లనున్న సీజేపీ నేతలు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తారని వేణు స్వామి ముందుగా చెప్పించే నిజమైంది. అది నీట్ (NEET) పేపర్ లీకేజీ విషయంలోనా లేక ఇతర కారణాల వల్లా అన్నది స్పష్టత లేకపోయినా, రాజీనామా మాత్రం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో సిజేపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందని, ఈ పార్టీ హిందూ ధర్మానికి లేదా శాస్త్రాలకు కొంత వ్యతిరేక దిశలో వెళ్ళే సూచనలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సీజేపీ వల్ల బీజేపీకి బాగా డ్యామేజ్ అవుతుంది
ముఖ్యంగా, సిజేపీ వల్ల భారతీయ జనతా పార్టీకి (బిజెపి) 90 శాతం డ్యామేజ్ జరగబోతోందని వేణు స్వామి హెచ్చరించారు. సిజేపీ జాతకం, భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతకం, బిజెపి పార్టీ జాతకంతో షష్టాష్టకాలు (అశుభకరమైన స్థానాలు) ఏర్పడటమే దీనికి కారణమని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఒక పార్టీని గద్దె ఎక్కించాలన్నా లేదా దించాలన్నా సిజేపీ ప్రభావం 60 శాతం వరకు ఉంటుందని, ఇది భారత రాజకీయాల్లో ఎవరూ ఊహించని మార్పులకు దారితీస్తుందని ఆయన ముగించారు.
Frequently Asked Questions
కాక్రోజ్ జనతా పార్టీ (CJP) భారతీయ జనతా పార్టీ (BJP) పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ట్రెండింగ్ వార్తలు






















