Anurag Thakur: రేసింగ్ బైక్ నడిపి మురిసిపోయిన కేంద్రమంత్రి, త్వరలోనే ఇండియాలో మోటో జీపీ రేస్
Anurag Thakur: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రేసింగ్ బైక్‌పై రైడ్ చేశారు.
Anurag Thakur:
అనురాగ్ ఠాకూర్ బైక్‌రైడ్..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బైక్‌రైడ్ చేశారు. ఢిల్లీలో Moto GP Ridersతో కలిసి బైక్ నడిపారు. భారత్‌లో తొలిసారి మోటో జీపీ రేస్ (Moto GP Race) జరగనుంది. ఈ ఈవెంట్‌ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలా సందడి చేశారు అనురాగ్ ఠాకూర్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో The Buddh International Circuit (BIC) ఈ రేస్‌ని నిర్వహించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 22-24 వరకూ మోటో జీపీ రేస్ జరగనుంది. గతంలో BIC 2011-13 మధ్య కాలంలో ఫార్ములా వన్ రేస్‌ని కూడా ఏర్పాటు చేసింది. మోటోజీపీ రేస్‌ని నిర్వహిస్తున్న 31వ దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. అనురాగ్ ఠాకూర్‌కి కస్టమైజ్డ్ హెల్మెట్ ఇచ్చారు BCCI మాజీ ప్రెసిడెంట్. ఆ హెల్మెట్‌తోనే రైడ్ చేశారు.
#WATCH | Delhi: Union Minister for Youth Affairs & Sports Anurag Thakur rides bike with Moto GP riders pic.twitter.com/2TNrDFUtRA
— ANI (@ANI) July 8, 2023
ఈ ఈవెంట్‌పై ఠాకూర్ స్పందించారు. తొలిసారి ఇండియాలో ఈ రేస్ జరుగుతోందని వెల్లడించారు. భారత్‌లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది జోష్ తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"మోటో జీపీ రేస్ తొలిసారి భారత్‌లో జరుగుతోంది. గౌతమబుద్ధనగర్‌లో ఇది జరగనుంది. ఈ రేస్‌లో తొలిసారి ఇండియన్ రేసర్ పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ తరవాత ఇండియాలో కూడా రేసింగ్ బైక్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కూడా బూస్ట్ వస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేసింగ్‌లో భారత్ దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రక్రీడాశాఖ మంత్రి
#WATCH | Union Minister for Youth Affairs & Sports Anurag Thakur says, "Moto GP is going to be held in India for the first time. This big event will be held in Gautam Budh Nagar, India. First time an Indian racer will participate in a Moto GP race. Now there will be a boost for… pic.twitter.com/o5UAiY6Osc
— ANI (@ANI) July 8, 2023
Also Read: UCC అమలు చేయడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సింపుల్ కాదు - గులాం నబీ ఆజాద్