అన్వేషించండి

wisha Sharma Murder Mystery: మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్ - వేధింపుల నుంచి మరణం వరకు అసలేం జరిగింది?

Twisha Sharma: భోపాల్ మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. ప్రేమ పెళ్లి, వేధింపులు, ఆత్మహత్య మిస్టరీ సంచలనంగా మారాయి.

Bhopal Model Death Case:   భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ  మృతి కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు, ఆమె భర్త  సమర్థ్ సింగ్ పోలీసులకు దొరికిపోయారు. కోర్టులో లొంగిపోయిన అతడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

కలల నగరం నుంచి కలత వైపు.. 

ట్విషా శర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గుర్తింపు పొందిన మోడల్. గ్లామర్ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని కలలు కన్న ఆమెకు,  సమర్థ్ సింగ్  అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో 2023లో వీరిద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ, ఆ వైభవం కొన్ని నెలలకే ఆవిరైపోయింది.

  పెళ్లంటే  వేధింపుల  కాపురం? 

పెళ్లయిన కొద్దిరోజులకే సమర్థ్ అసలు రంగు బయటపడింది. ట్విషా మోడలింగ్ వృత్తిని అతడు ద్వేషించేవాడు. ఆమె ఫోన్ చెక్ చేయడం, బయటకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం, చిన్న విషయానికే కొట్టడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. సమర్థ్ కుటుంబ సభ్యులు సైతం అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే నరకం చూపిస్తున్నాడని ట్విషా తన స్నేహితుల వద్ద కన్నీరు మున్నీరైనట్లు పోలీసు విచారణలో తేలింది.   

 మరణం మిగిల్చిన ప్రశ్నలు 

గత ఏప్రిల్ నెలలో ట్విషా శర్మ భోపాల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఆమె ఒంటిపై ఉన్న గాయాలు, అపార్ట్‌మెంట్‌లో చిందరవందరగా ఉన్న వస్తువులు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ట్విషా ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను చంపి ఫ్యాన్‌కు వేలాడదీశారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

 సమర్థ్ అదృశ్యం - పోలీసుల గాలింపు 

ట్విషా మరణించినప్పటి నుండి భర్త సమర్థ్ సింగ్ కనిపించకుండా పోయాడు. పోలీసులు నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. రెండు నెలల పాటు వేర్వేరు నగరాల్లో మారువేషంలో తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు సమర్థ్. అతడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు చుట్టుముడుతున్నారని గ్రహించిన సమర్థ్ సింగ్, శనివారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడిని భోపాల్ పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్విషా రాసినట్లుగా భావిస్తున్న ఒక  డైరీ  ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో సమర్థ్ తనపై చేసిన చిత్రహింసలను ఆమె పూసగుచ్చినట్లు రాసినట్లు తెలుస్తోంది.
  
సమర్థ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, ట్విషా మరణించిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది? వారి మధ్య గొడవకు కారణమేంటి? ఆమెను ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ట్విషా శర్మ జీవితం ఇలా విషాదాంతం కావడం భోపాల్ వాసులను కలచివేసింది.

టాప్ హెడ్ లైన్స్

LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
Pamban Rail Bridge suicides: పాంబన్ రైల్వే వంతెనపై విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
పాంబన్ రైల్వే వంతెనపై వరుస విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget