అన్వేషించండి

Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!

Machilipatnam Latest News:కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ కాలేజీ లెక్చరర్‌ ఒకరు ఉద్యోగం ఆశ చూపించి యువతిని మోసం చేయబోయాడు. భర్త ప్రవర్తనపై నిఘా ఉంచిన భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉద్యోగం పేరుతో యువతిని లోబరుచుకునేందుకు లెక్చరర్ యత్నించాడు.
  • యువతి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని లెక్చరర్ ప్రవర్తించాడు.
  • భార్య రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
  • లెక్చరర్​పై భార్య ఫిర్యాదు, కేసు నమోదు చేసి విచారణ.

Machilipatnam Lecturer Joshua Arrested: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్‌ లెక్చర్‌గా పని చేస్తున్న భర్త అక్రమ బాగోతాన్ని ఒక భార్య సమాజానికి బహిర్గతం చేసింది. ఉద్యోగం పేరుతో ఓ నిస్సహాయ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన భర్తకు సడెన్  సర్‌ప్రైజ్‌ ఇస్తూ పోలీసులతో కలిసి రౌండప్ చేసి పట్టుకుంది. సమాజంలో గురువుగా గౌరవం పొందాల్సిన వ్యక్తి చేసిన నీచమైన పనికి స్థానికులు అసహ్యించుకుంటున్నారు. 

ఉద్యోగం ఆశ చూపించి గదికి...

పోలీసులు, స్థానికులు, భార్య కథనం ప్రకారం... జాషువా అనే వ్యక్తి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ఓ మహిళా కాలేజీలోనూ సేవలు అందించాడు. ఈ క్రమంలోనే ఉద్యోగ వేటలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక యువతి అతనికి పరిచయమైంది. 

ఆమె నిస్సహాయతను అదునుగా చేసుకున్న జాషువా, తనకు తెలిసిన రికమండేషన్లుతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకోసం మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఒక ఇంటికి పిలిచాడు. ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ సదరు యువతిని ఒప్పించాడు. 

సీన్‌లోకి భార్య ఎంట్రీ... దేహశుద్ధి

యువతితో కలిసి లెక్చరర్‌ జాషువా గదిలో ఉన్న సమయంలోనే అతని భార్య పక్కా ప్లాన్‌తో ఎంట్రీ ఇచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు విషయం చేరవేసింది. దీంతో చుట్టుప్కల వారు గుమిగూడటంతో జరిగిందంతా వివరించి, లెక్చరర్ అని కూడా చూడకుండా దేహశుద్ధి చేసింది. 

భార్య ఏం చెప్పిందంటే...." మాకు పెళ్లై 25 ఏళ్లు దాటింది. పెళ్లైన మొదటి రోజు నుంచే ఇతనికి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అలవాటు ఉంది. నిలదీస్తే నన్ను దారుణంగా కొట్టేవాడు. ఈ మధ్య ఒక మహిళ మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేసింది. అప్పుడు మా పిల్లలు ఇతనికి బుద్ది చెప్పారు. అయినా బద్ది మార్చుకోలేదు. ఇక్కడికి వచ్చి మళ్లీ అదే వేషాలు వేస్తున్నాడు" అని భార్య వాపోయింది. 

లెక్చరర్ అని అద్దెకు ఇస్తే... 

ఈ ఘటనతో గొడుగుపేటలోని సదురు ఇంటి యజమానులు కూడా షాక్‌కి గురయ్యారు. లెక్చరర్ ఉద్యోగం అని చెప్తేనే ఇంటిని అద్దెకు ఇచ్చామని, ఇలాంటి క్యారెక్టర్‌ లేని అని తెలియదని పేర్కొంటున్నారు. వెంటనే అతని సామానులు బయటపడేశారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. 

Frequently Asked Questions

మచిలీపట్నంలో లెక్చరర్ జాషువాను ఎవరు అరెస్ట్ చేశారు?

జాషువా భార్య, ఉద్యోగం పేరుతో ఒక యువతిని లోబరుచుకోవడానికి ప్రయత్నించిన అతని అక్రమ బాగోతాన్ని బయటపెట్టి, పోలీసులకు అప్పగించి అరెస్ట్ చేయించింది.

జాషువా ఏ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు?

జాషువా ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఒక మహిళా కళాశాలలో కూడా పనిచేశాడు.

జాషువా యువతిని ఎలా లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు?

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, తన కోరిక తీర్చాలని జాషువా ఆ యువతిని ఒక ఇంటికి పిలిచి ఒత్తిడి చేశాడు.

జాషువా భార్య అతనిని ఎలా పట్టుకుంది?

జాషువా యువతితో గదిలో ఉన్న సమయంలో, అతని భార్య పక్కా ప్లాన్‌తో వెళ్లి, తలుపులు బద్దలు కొట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఈ సంఘటనపై జాషువా ఇంటి యజమానులు ఏమన్నారు?

లెక్చరర్ అని చెప్పి ఇల్లు అద్దెకిస్తే, ఇలాంటి పనులు చేస్తాడని తెలియదని, వెంటనే అతని సామాను బయట పడేశామని ఇంటి యజమానులు పేర్కొన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget