అన్వేషించండి

FBI Shuts India Call Centre: కాల్ సెంటర్ ఇక్కడ - దోచుకునేది మాత్రం అమెరికన్లను - వేల కోట్లు కొట్టేసిన ముఠాను పట్టేసిన FBI

Tech Support Scam 2026: అమెరికన్ వృద్ధులను బురిడీ కొట్టిస్తున్న భారత్ కేంద్రంగా నడుస్తున్న కాల్ సెంటర్‌ను FBI మూసివేయించింది. 2.1 బిలియన్ డాలర్ల మేర ఈ ముఠా మోసం చేసింది.

India-based Telemarketing Fraud:  అమెరికాలో ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, టెక్ సపోర్ట్ పేరుతో వారి జీవితకాల పొదుపును కొల్లగొడుతున్న ఒక భారీ అంతర్జాతీయ కుంభకోణాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ  FBI  బట్టబయలు చేసింది. భారత్ కేంద్రంగా నడుస్తున్న ఒక కాల్ సెంటర్‌ను మూసివేయించిన ఎఫ్‌బీఐ, ఈ మోసాలకు సహకరించిన ఇద్దరు అమెరికన్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా  అరెస్టు చేసింది.  సాధారణంగా భారతీయులను నైజీరియన్లు మోసం చేస్తున్నారని మనం వింటుంటాం, కానీ ఈ కేసులో కొందరు భారతీయులే అమెరికన్లను మోసం చేశారు. 

ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. అమెరికన్ల కంప్యూటర్ స్క్రీన్‌లపై అకస్మాత్తుగా  మీ సిస్టమ్ వైరస్ బారిన పడింది  అని ఒక నకిలీ పాప్-అప్ మెసేజ్ వస్తుంది. భయపడిన వృద్ధులు ఆ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగానే, అది భారత్‌లోని కాల్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ పనిచేసే వారు టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటించి, సాఫ్ట్‌వేర్ క్లీనింగ్ పేరుతో వందల నుండి వేల డాలర్లను వసూలు చేస్తారు. గతేడాది ఒక్క అమెరికాలోనే ఇలాంటి టెక్ సపోర్ట్ స్కామ్‌ల వల్ల ప్రజలు ఏకంగా 2.1 బిలియన్ డాలర్లు అంటే  సుమారు రూ.17,500 కోట్లు సంపదను కోల్పోయారు.

ఈ అక్రమ వ్యాపారానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆడమ్ యంగ్ , హారిసన్ గెవిర్ట్జ్  అనే ఇద్దరు అమెరికన్లు తమ తప్పును అంగీకరించారు. వీరు నడుపుతున్న టెలికాం కంపెనీ ద్వారానే ఈ మోసపూరిత కాల్స్ రూటింగ్ అయ్యేవి. విచారణలో భాగంగా ఐదుగురు భారతీయులు సాహిల్ నారంగ్, చిరాగ్ సచ్‌దేవా, అబ్రార్ అంజుమ్, మనీష్ కుమార్ , జగమీత్ సింగ్ విర్క్ ఇప్పటికే దోషులుగా తేలారు. తమ స్వార్థం కోసం వృద్ధుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఈ నిందితులకు  జూన్ 16, 2026 న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

 వృద్ధులు గౌరవానికి, రక్షణకు అర్హులు.. వారిని లక్ష్యంగా చేసుకుంటే శిక్ష తప్పదు  అని ఎఫ్‌బీఐ బాస్టన్ విభాగం హెచ్చరించింది. ఈ స్కామర్లు కేవలం డబ్బునే కాదు, బాధితుల మానసిక ప్రశాంతతను కూడా హరించారని దర్యాప్తు అధికారులు తీవ్రంగా ఖండించారు. ప్రతి కాల్ వెనుక ఒక అమాయక వ్యక్తి అవమానానికి, ఆర్థిక విధ్వంసానికి గురవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రోడ్ ఐలాండ్ అనే చిన్న ప్రాంతంలోనే బాధితులు సుమారు 5.7 మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారంటే ఈ మోసం ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

భారత్-అమెరికా మధ్య ఉన్న సహకారంతో ఇలాంటి కాల్ సెంటర్లపై నిరంతరం దాడులు జరుగుతున్నా, కొత్త రూపాల్లో ఈ ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్‌లను ఛేదించడం ద్వారా డిజిటల్ భద్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఎఫ్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేసు ద్వారా భారత్‌లోని నకిలీ కాల్ సెంటర్ల నిర్వహకులకు, వారికి సహకరించే విదేశీ శక్తులకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.  

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget