అన్వేషించండి

TVK Vijay Masterstroke: విజయ్ మాస్టర్‌స్ట్రోక్.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన..

TVK VIjay: 'దళపతి' విజయ్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులోనే అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్న విజయ్.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ప్లాన్ సిద్ధం చేశారు.

Vijay Master Stroke:తమిళనాడు పొలిటికల్ గ్రౌండ్ మరింత వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరిచిన తమిళగ వెట్రి కజగంను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ఆ పార్టీ అధినేత, శాసనసభాపక్ష నేత TVK విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మాత్రం మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితా తీసుకురమ్మని చెబుతున్నారు.ఈ పీఠముడి ఇలా కొనసాగుతున్న సమయంలోనే బద్ఠ శత్రువులైన DMK, AIDMK చేతులు కలుపుతాయని విజయ్‌ను అధికారంలోకి రాకుండా చేస్తాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విజయ్ పెద్ద బాంబ్ పేల్చనున్నారు. 


ప్లాన్‌-బి సిద్ధం చేసుకున్న TVK అధినేత 

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన తదుపరి వ్యూహంతో అటు అధికార DMK, ఇటు ప్రతిపక్ష AIADMK వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నారు. TVK అధినేత ప్లాన్‌-బి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనను ప్రభుత్వ ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకుంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. DMK, AIDMK కలవడానికి అవకాశాలు చాలా తక్కువ.  ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. (ఇదంతా ఊహాజనితమే అయినా..) విజయ్ ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోయే అవకాశం ఎంతవరకూ ఉంటుందో తెలీదు కానీ.. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వలేదన్న ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో అప్పటికి ఏర్పడ్డ ప్రభుత్వంలోని కొందరు రాజీనామా చేయొచ్చు. లేదా.. తనకు న్యాయంగా దక్కాల్సిన అవకాశాన్ని దూరం చేశారని విజయ్ ప్రజలకు చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుంది. 


ఎమ్మెల్యేలకు సంకేతాలు.. సిద్ధంగా ఉండాలని ఆదేశం

ఈ మేరకు ఇప్పటికే తన పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులకు, కీలక నేతలకు విజయ్ సంకేతాలు పంపినట్లు సమాచారం.

"మనం అధికారంలోకి రావాల్సింది ప్రజలకు సేవ చేయడానికి. ఒకవేళ వ్యవస్థ మనల్ని అడ్డుకుని, మళ్లీ పాత పాలనకే బాటలు వేయాలని చూస్తే.. పదవుల కంటే ప్రజాక్షేత్రమే ముఖ్యం. అందరూ త్యాగాలకు సిద్ధంగా ఉండండి" అని విజయ్ తన కేడర్‌కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.


బలనిరూపణకు చాన్స్ ఇవ్వాలి
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తీసుకున్న 'రాజీనామా' నిర్ణయం వెనుక బలమైన రాజ్యాంగబద్ధమైన కారణాలు,  చరిత్ర కూడా కనిపిస్తున్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అతిపెద్ద పార్టీగా నిలిచినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం అనేది భారత రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సంఖ్యాబలం నిరూపితం కావలసింది అసెంబ్లీలోనే కానీ.. లోక్‌భవన్‌లో కాదని TVK వాదిస్తోంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా అతిపెద్ద పార్టీని ఆహ్వానించారని చెబుతోంది. 

  • 2018లో కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఎక్కువ బలం ఉందని వాదించినా.. అప్పటి గవర్నర్ వాజుభాయ్ వాలా మొదట బీజేపీ నేత యడియూరప్పను ఆహ్వానించారు. బల నిరూపణకు సమయం ఇచ్చారు. ఇది విజయ్ తరపున వినిపిస్తున్న బలమైన వాదనకు ఒక ఉదాహరణ.
  • జయలలిత మరణం తర్వాత AIADMK రెండుగా చీలిపోయింది. అప్పట్లో పళనిస్వామి (EPS) కి మెజారిటీ ఉందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి. అయినప్పటికీ గవర్నర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో బల నిరూపణ (Floor Test) ద్వారానే ఆయన తన మెజారిటీని 122 ఓట్లతో నిరూపించుకున్నారు. "రాజ్ భవన్ లో కాదు.. అసెంబ్లీలోనే బలం తేలాలి" అనే సూత్రం ఇక్కడ అమలైంది.
  • 1996లో అటల్ బిహారీ వాజ్ పేయీ నాయకత్వంలోని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్పష్టమైన మెజారిటీ లేకున్నా రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ వాజ్ పేయీని ఆహ్వానించారు. ఆయన 13 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు. మెజారిటీ నిరూపించుకోలేమని తెలిసి ఓటింగ్ కు ముందే రాజీనామా చేశారు. కానీ అవకాశం మాత్రం దక్కింది.

ప్రస్తుతం టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో. "నాకు ఆ 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాలి" అని గవర్నర్ మెలిక పెట్టడం అన్యాయమని విజయ్ వర్గం భావిస్తోంది. చరిత్రలో యడియూరప్పకు లేదా గతంలో ఇతర నేతలకు ఇచ్చిన అవకాశం.. 'దళపతి'కి ఎందుకు ఇవ్వరు? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

బల నిరూపణకు అవకాశం ఇస్తే.. ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టడం లేదా స్వతంత్రుల అండతో నెట్టుకురావడం సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ ఆ అవకాశమే ఇవ్వకపోతే.. ఎమ్మెల్యేల రాజీనామా ద్వారా వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజలే తేల్చుకునేలా చేయాలన్నది ఆయన ప్లాన్.

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget