అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: కింగ్ కావడమే లక్ష్యం -అందుకే ఒంటరి పోరు- విజయ్ నమ్మకానికి కారణమేంటి?

TVK Vijay: టీవీకే విజయ్ ఇతరులతో పొత్తులు పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం సీఎం అభ్యర్థిత్వంపై సందేహాలు ఉండటమే. అందుకే ఒంటరి పోరుతో కింగ్ కావాలనుకుంటున్నారు.

TVK Vijay Aims CM Post: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ  దళపతి విజయ్ రాజకీయ వ్యూహాలు అటు ద్రావిడ పార్టీల్లోనూ, ఇటు విశ్లేషకుల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపించిన నాటి నుండి విజయ్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే  వంటి ప్రధాన పార్టీల నుండి పొత్తుల ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ, ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టి ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మొండితనం వెనుక బలమైన రాజకీయ ఆకాంక్ష ,  కింగ్ మేకర్ కంటే కింగ్  గానే నిలబడాలనే పట్టుదల కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 సర్వేల లెక్కలు.. విజయ్ ఆశలు 

ఇటీవల వెలువడిన కొన్ని అంతర్గత ,  బహిరంగ సర్వేల ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 15 శాతం నుండి 20 శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ ఓటు శాతం ప్రాథమికంగా చూస్తే గెలుపుకు సరిపోకపోయినా, రాష్ట్రంలోని ఫలితాలను తలకిందులు చేయడానికి సరిపోతుంది.  విజయ్ మాత్రం ఈ సర్వేలను కేవలం ఆరంభంగానే భావిస్తున్నారు. తనకున్న భారీ ఫ్యాన్ బేస్ , ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల మద్దతుతో ఈ శాతాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన నమ్ముతున్నారు. ఈ ఆత్మవిశ్వాసమే ఆయనను ఒంటరిగా బరిలోకి దిగేలా ప్రేరేపిస్తోంది.

 సీఎం సీటుపై రాజీ పడకూడదనే పట్టుదల 

అన్నాడీఎంకే పొత్తు ఆఫర్ తిరస్కరించడం వెనుక ప్రధాన కారణం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమేనని సమాచారం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే అధికారం కోసం పరితపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎడప్పాడి పళనిస్వామి తన ముఖ్యమంత్రి పీఠాన్ని విజయ్ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అటు విజయ్ కూడా ఎవరి కిందో జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. పవర్ షేరింగ్  అనే అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చినప్పటికీ, తన మొదటి ఎన్నికల్లోనే తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని, ఎవరి ముందో తలవంచకూడదని ఆయన భావిస్తున్నారు.

 కింగ్ కాకపోతే కింగ్ మేకర్.. అదే వ్యూహం! 

విజయ్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో తానే నిర్ణయాత్మక శక్తిగా మారతానని ఆయన అంచనా వేస్తున్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా విజయ్ మద్దతు తప్పనిసరి అవుతుంది. అప్పుడు కింగ్ మేకర్ హోదాలో తన డిమాండ్లను నెగ్గించుకోవచ్చని, లేదా తననే ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టే అవకాశం ఉంటుందని ఆయన వ్యూహకర్తలు విశ్లేషిస్తున్నారు. ఈ  రిస్క్  తీసుకోవడానికే ఆయన సిద్ధపడ్డారు.
 
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నేతలు సాధారణంగా ఏదో ఒక బలమైన కూటమిలో చేరి తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ విజయ్ మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమా లేక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్ అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
Embed widget